Ali : సినిమా ఫ్లాప్ అయితే ఇండ‌స్ట్రీ వాళ్లే చంక‌లు గుద్దుకుంటున్నారు.. ఆలీ సంచ‌ల‌న కామెంట్స్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ali : సినిమా ఫ్లాప్ అయితే ఇండ‌స్ట్రీ వాళ్లే చంక‌లు గుద్దుకుంటున్నారు.. ఆలీ సంచ‌ల‌న కామెంట్స్..!

 Authored By sandeep | The Telugu News | Updated on :31 May 2022,7:30 pm

Ali : ఇటీవ‌లి కాలంలో అన్ని సినిమాల‌కు నెగెటివిటీ ఎక్కువ‌గా ప్ర‌చారం జ‌రుగుతుంది. సినిమా బాగున్నా కూడా కొంద‌రు ప‌నిగ‌ట్టుకొని కొంద‌రు త‌ప్పుడు ప్ర‌చారాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆలీ తాజాగా జ‌రిగిన వేడుక‌లో గ‌ట్టిగా స్పందించారు. 45 ఏళ్లుగా నవ్వునే నమ్ముకుని సినిమాలు చేస్తున్నాను. అలా ‘ఎఫ్‌ 2’, ‘ఎఫ్‌ 3’ చేశాను. ప్రపంచంలోని నలుమూలల నుంచి నాకు ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి. ‘మీ పాత సినిమాలు గుర్తుకు వస్తున్నాయి’ అని అభినందిస్తున్నారు. నాకు నా ‘మాయలోడు’ సినిమా గుర్తొచ్చింది’’ అన్నారు రాజేంద్రప్రసాద్‌. ‘‘హిట్టయిన సినిమాను కూడా బాగాలేదని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇది సరి కాదు. సినిమా బాగుంటే ప్రేక్షకులు ఎంతలా ఆదరిస్తారనే విషయానికి ‘ఎఫ్‌ 3’ సక్సెస్‌ ఓ నిదర్శనం’’ అని తెలిపారు అలీ.

Ali : ఆలీ ఆగ్ర‌హం..

యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అనిల్ తాజాగా తెరకెక్కించిన ఎఫ్3 చిత్రం గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ చిత్రం తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది.చిత్ర యూనిట్ ఇటీవల సక్సెస్ సెలెబ్రేషన్స్ కూడా నిర్వహించారు. ఇటీవల సోషల్ మీడియాలో సినిమాలపై నెగిటివ్ ప్రచారం ఎక్కువైపోయింది. కొందరు పని కట్టుకుని మరీ నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు అని ఇటీవల అనిల్ రావిపూడి కూడా కామెంట్స్ చేశారు.

ali fire on negative reviewers

ali fire on negative reviewers

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా, తమన్నా, మెహరీన్, సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఎఫ్‌ 3’. ‘దిల్‌’ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న రిలీజైంది. ఈ సందర్భంగా సోమవారం (మే 30) ఈ సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ జరిగాయి. ‘‘ఈ చిత్రాన్ని ఎలాంటి ఫ్రస్ట్రేషన్‌ లేకుండా తీశారు అనిల్‌ రావిపూడి. థియేటర్‌లో పిల్లలు కూడా బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు’’ అన్నారు వరుణ్‌ తేజ్‌. ‘‘కరోనా తర్వాత ‘అఖండ’, ‘పుష్ప’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘భీమ్లానాయక్‌’, ‘సర్కారు వారి పాట’ చిత్రాలు ప్రేక్షకులను థియేటర్స్‌కు తీసుకుని వచ్చాయి. ఇప్పుడు ‘ఎఫ్‌ 3’ తీసుకొచ్చింది. విడుదలైన రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురుస్తోంది.

Tags :

    sandeep

    No bio available for this author.

    Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి