Ali : ఇటీవలి కాలంలో అన్ని సినిమాలకు నెగెటివిటీ ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. సినిమా బాగున్నా కూడా కొందరు పనిగట్టుకొని కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆలీ తాజాగా జరిగిన వేడుకలో గట్టిగా స్పందించారు. 45 ఏళ్లుగా నవ్వునే నమ్ముకుని సినిమాలు చేస్తున్నాను. అలా ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ చేశాను. ప్రపంచంలోని నలుమూలల నుంచి నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ‘మీ పాత సినిమాలు గుర్తుకు వస్తున్నాయి’ అని అభినందిస్తున్నారు. నాకు నా ‘మాయలోడు’ సినిమా గుర్తొచ్చింది’’ అన్నారు రాజేంద్రప్రసాద్. ‘‘హిట్టయిన సినిమాను కూడా బాగాలేదని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇది సరి కాదు. సినిమా బాగుంటే ప్రేక్షకులు ఎంతలా ఆదరిస్తారనే విషయానికి ‘ఎఫ్ 3’ సక్సెస్ ఓ నిదర్శనం’’ అని తెలిపారు అలీ.
యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అనిల్ తాజాగా తెరకెక్కించిన ఎఫ్3 చిత్రం గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ చిత్రం తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది.చిత్ర యూనిట్ ఇటీవల సక్సెస్ సెలెబ్రేషన్స్ కూడా నిర్వహించారు. ఇటీవల సోషల్ మీడియాలో సినిమాలపై నెగిటివ్ ప్రచారం ఎక్కువైపోయింది. కొందరు పని కట్టుకుని మరీ నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు అని ఇటీవల అనిల్ రావిపూడి కూడా కామెంట్స్ చేశారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఎఫ్ 3’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న రిలీజైంది. ఈ సందర్భంగా సోమవారం (మే 30) ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ జరిగాయి. ‘‘ఈ చిత్రాన్ని ఎలాంటి ఫ్రస్ట్రేషన్ లేకుండా తీశారు అనిల్ రావిపూడి. థియేటర్‌లో పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు’’ అన్నారు వరుణ్ తేజ్. ‘‘కరోనా తర్వాత ‘అఖండ’, ‘పుష్ప’, ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘భీమ్లానాయక్’, ‘సర్కారు వారి పాట’ చిత్రాలు ప్రేక్షకులను థియేటర్స్‌కు తీసుకుని వచ్చాయి. ఇప్పుడు ‘ఎఫ్ 3’ తీసుకొచ్చింది. విడుదలైన రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురుస్తోంది.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.