Alia bhatt : సెన్సెషనల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్‌లో భారీ అంచనాలతో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ మూవీ కోసం టాలీవుడ్ మాత్రమే కాదు దేశం మొత్తం ఎదురుచూస్తోంది. ఈ మూవీని సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. జనవరి 7వ తేదీన దీనిని రిలీజ్ చేసేందుకు రెడీ అయింది మూవీ యూనిట్. ఈ మూవీ కోసం సుమారు రూ.400 కోట్లు ఖర్చు చేశారని టాక్. ఇక తాజాగా రిలీజ్ అయిన మూవీ ట్రైలర్ రికార్డులను బద్దలు కొడుతోంది. రిలీజ్ చేసిన క్షణాల్లోనే మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని యూ ట్యూబ్‌లో దూసుకుపోతోంది. దీనిని చూసిన ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోతున్నారు.
డైరెక్టర్ ఈ మూవీని విజువల్ వండర్‌గా మార్చాడని కామెంట్స్ చేస్తున్నారు. ప్రముఖులు సైతం ట్రైలర్ చూసి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం ఈ మూవీ ట్రైలర్ చూసి మైండ్ బ్లోయింగ్ అన్నాడన్న విషయం తెలిసిందే.ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని ముంబాయిలో ఏర్పాటు చేసింది మూవీ యూనిట్. ఈ ఈవెంట్‌లో నిర్మాత దానయ్య, డైరెక్టర్ రాజమౌళి, యాక్టర్స్ ఆలియా, ఎన్టీఆర్, అజయ్ దేవగణ్ అంతా పక్కపక్కనే కూర్చున్నారు. ఈ టైంలో అలియా భట్ కాలుమీద కాలు వేసుకోబోతుండగా తన కాలు పక్కనే ఉన్న రాజమౌళికి తగిలింది.
దీంతో ఆమె వెంటనే రాజమౌళి కాళ్లకు దండం పెట్టబోతుండగా ఆయన వద్దు వద్దు అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెద్ద హీరోయిన్ అయినా ఎలాంటి గర్వం లేకుండా ఆలియా ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంది. ఆమె సంస్కారాన్ని ప్రశంసిస్తున్నారు నెటిజన్స్. ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ మూవీలో సీత క్యారెక్టర్‌లో యాక్ట్ చేసింది అలియా. విడుదలకు ముందే ఇంత హైప్ క్రియేట్ చేస్తున్న ఈ మూవీ.. రిలీజ్ అయ్యాక రికార్డులను బద్దలు కొడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మూవీ చూడాలంటే జనవరి 7వ తేదీ వరకు వేచి ఉండాల్సిందే.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.