Alia bhatt : రాజమౌళి కాళ్లు మొక్కబోయిన అలియా భట్.. కారణం ఏంటంటే..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Alia bhatt : రాజమౌళి కాళ్లు మొక్కబోయిన అలియా భట్.. కారణం ఏంటంటే..?

 Authored By mallesh | The Telugu News | Updated on :11 December 2021,5:00 pm

Alia bhatt : సెన్సెషనల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్‌లో భారీ అంచనాలతో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ మూవీ కోసం టాలీవుడ్ మాత్రమే కాదు దేశం మొత్తం ఎదురుచూస్తోంది. ఈ మూవీని సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. జనవరి 7వ తేదీన దీనిని రిలీజ్ చేసేందుకు రెడీ అయింది మూవీ యూనిట్. ఈ మూవీ కోసం సుమారు రూ.400 కోట్లు ఖర్చు చేశారని టాక్. ఇక తాజాగా రిలీజ్ అయిన మూవీ ట్రైలర్ రికార్డులను బద్దలు కొడుతోంది. రిలీజ్ చేసిన క్షణాల్లోనే మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని యూ ట్యూబ్‌లో దూసుకుపోతోంది. దీనిని చూసిన ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోతున్నారు.

డైరెక్టర్ ఈ మూవీని విజువల్ వండర్‌గా మార్చాడని కామెంట్స్ చేస్తున్నారు. ప్రముఖులు సైతం ట్రైలర్ చూసి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం ఈ మూవీ ట్రైలర్ చూసి మైండ్ బ్లోయింగ్ అన్నాడన్న విషయం తెలిసిందే.ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని ముంబాయిలో ఏర్పాటు చేసింది మూవీ యూనిట్. ఈ ఈవెంట్‌లో నిర్మాత దానయ్య, డైరెక్టర్ రాజమౌళి, యాక్టర్స్ ఆలియా, ఎన్టీఆర్, అజయ్ దేవగణ్ అంతా పక్కపక్కనే కూర్చున్నారు. ఈ టైంలో అలియా భట్ కాలుమీద కాలు వేసుకోబోతుండగా తన కాలు పక్కనే ఉన్న రాజమౌళికి తగిలింది.

alia bhatt with rajamoulis legs amputated

alia bhatt with rajamoulis legs amputated

Alia bhatt : అలియాభట్ సంస్కారానికి ప్రశంసలు

దీంతో ఆమె వెంటనే రాజమౌళి కాళ్లకు దండం పెట్టబోతుండగా ఆయన వద్దు వద్దు అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెద్ద హీరోయిన్ అయినా ఎలాంటి గర్వం లేకుండా ఆలియా ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంది. ఆమె సంస్కారాన్ని ప్రశంసిస్తున్నారు నెటిజన్స్. ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ మూవీలో సీత క్యారెక్టర్‌లో యాక్ట్ చేసింది అలియా. విడుదలకు ముందే ఇంత హైప్ క్రియేట్ చేస్తున్న ఈ మూవీ.. రిలీజ్ అయ్యాక రికార్డులను బద్దలు కొడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మూవీ చూడాలంటే జనవరి 7వ తేదీ వరకు వేచి ఉండాల్సిందే.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది