BalaKrishna: బాలయ్య కి ఏ ప్రొడ్యూసర్ ఇవ్వలేని బంపర్ ఆఫర్ ఇచ్చిన అల్లూ అరవింద్ , ఆహా .. చిరంజీవి కూడా ఖంగుతిన్నాడు !

Authored By Sam C | The Telugu News | Published on: January 22, 2022, 2:00 pm

BalaKrishna : మెగా ఫ్యామిలీని వ‌దిలి నంద‌మూరి ఫ్యామిలీ వెన‌క ప‌డ్డాడు అల్లు అర‌వింద్. సీనియ‌ర్ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ‌తో అన్‌స్టాప‌బుల్ అనే టాక్ షో చేసి సంచ‌ల‌నాలు సృష్టించాడు అల్లు అర‌వింద్.అన్‌స్టాప‌బుల్ టాక్ షో వ‌ల‌న బాల‌కృష్ణ‌కు అల్లు ఫ్యామిలీతో మంచి అనుబంధం ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలో బాలయ్యని తొలి సారి హోస్ట్ గా పరిచయం చేసి `అన్ స్టాపబుల్ విత్ ఎన్ బికె` టాక్ షో తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన అల్లు అరవింద్ బాలయ్యని తో సినిమా నిర్మిస్తూ సర్ ప్రైజ్ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.అల్లు అర‌వింద్ తన గీతాఆర్ట్స్ బ్యానర్ పై బాలయ్యను హీరోగా పెట్టి ఓ భారీ బడ్జెట్ సినిమా చేయాలనుకుంటున్నారు.

అల్లు అరవింద్ తో ఉన్న బాండింగ్ కారణంగా బాలయ్య ‘నో’ చెప్పే ఛాన్స్ లేదు. కాబట్టి ఈ కాంబినేష‌న్‌లో బ‌డా చిత్రం రూపొంద‌నుండ‌గా, దీనికి ద‌ర్శ‌కుడు ఎవ‌రు అనే దానిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంద‌ని అంటున్నారు. బాలయ్యని పవర్ ఫుల్ పాత్రలో చూపించబోయే ఈ మూవీ కోసం ఇప్పటికే అల్లు అరవింద్ పలు దర్శకులతో చర్చిస్తున్నారని చెబుతున్నారు. బాలయ్య బాడీ లాంగ్వేజ్ కు సరిపడే స్టోరీ, అలాగే ఆయనని మరింత కొత్తగా ప్రజెంట్ చేయగల దర్శకుడు ఫైనల్ కాగానే ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించాలని అల్లు అరవింద్ ప్లాన్ చేస్తార‌ట‌.

allu aravind do movie Offer balakrishna

allu aravind do movie Offer balakrishna

BalaKrishna : బాండింగ్ బ‌ల‌ప‌డుతుందిగా..!

నందమూరి బాలకృష్ణ చివ‌రిగా ‘అఖండ’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా రీసెంట్‌గా 50రోజులు పూర్తి చేసుకుంది. చిత్రం సాధించిన విజ‌యంతో ఆయ‌న మ‌రింత ఉత్సాహంగా సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నారు. త్వ‌ర‌లో గోపిచంద్ మ‌లినేనితో ఓ చిత్రం , అనీల్ రావిపూడితో ఓ చిత్రం చేయ‌నున్నాడు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp