allu aravind talks about kota bommali movie
Allu Aravind : హీరో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిన కోట బొమ్మాళి పీఎస్ సినిమా నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈనేపథ్యంలో సినిమా ప్రచార సభను తాజాగా నిర్వహించారు. ఈ ప్రచార సభకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీకు ఇంకా ఈ కథ ఎత్తుకోవడం, తీయడంలో ఒకే ఒక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. ఎవ్వరూ చెప్పని ఒక చిన్న కథ చెబుతాను అంటే.. ఇప్పుడు పోలీసులు క్రిమినల్స్ ను, క్రిమినల్స్ వాళ్లకు లొంగే వాళ్లను ఇలాంటివి జరుగుతుంటాయి. ఈ కథలో ప్రత్యేకంగా ఏంటంటే పోలీసులను పోలీసులే ఛేజ్ చేస్తుంటారు. సినిమా అంతా పోలీసులను పోలీసులు పట్టుకోవాలనే విచిత్రమైన కథ. అందుకనే ఈ కథ నాకు బాగా నచ్చింది. ఈ కథలో ఎవ్వరూ హీరోలు లేరు.. ఎవ్వరూ విలన్స్ లేరు. అందరూ క్యారెక్టర్స్. కథే హీరోగా వెళ్తూ ఉంటుంది. తప్పనిసరిగా ఈ వెరైటీ కథను ఆదరిస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు అరవింద్.
నేను ప్రత్యేకంగా బోయపాటి గారికి, ఆయన ఎక్కడో రాస్తూ దూరంగా ఉన్నా కూడా అక్కడి నుంచి వచ్చి ఇలా ట్రెండ్ చేసి మళ్లీ అక్కడికి వెళ్లాలని చెప్పి వచ్చినందుకు చాలా థాంక్స్ అన్నారు. శ్రీకాంత్ నాకు బాగా తెలిసిన వ్యక్తి. ఎప్పుడో పెళ్లి సందడి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ అవకాశం ఉన్నా నాతో ఆయన యాక్ట్ చేస్తూ ఉంటాడు మా సినిమాల్లో. మాస్టర్, ఆయన కొడుకు ఇక్కడికి రావడం, హీరోగా ఉండటం.. ఆయన మా సినిమాల్లో చేయడం, ఫైటర్ గా చేయడం.. ఇప్పుడు ఆయన అబ్బాయి హీరోగా చేయడం.. ఇదంతా మా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం అన్నారు. ఇంత కాలం ఉండి ఇవన్నీ చేయగలిగిన ఒక అదృష్టం మాకు ఉంది. ఈ కోట బొమ్మాళి పోలీస్ స్టేషన్ లో ఒక్క ముఖ్యమైనది ఏంటంటే.. పోలీసులను ఎట్లా వాడుకుంటారు రాజకీయ నాయకులు అనే నేపథ్యం. ఏదో ఒక చోటు తీసుకోవాలి కాబట్టి కోట బొమ్మాళిని తీసుకున్నాం. ఇది ఏ రాజకీయ నాయకులను, పోలీస్ ఆఫీసర్ ను ఉద్దేశించి మేము తీయలేదు. ఇది కేవలం ఆల్ ఇండియాలో ఉన్న ఈ వ్యవస్థను ఖండిస్తూ తీసిన ఒక సినిమా ఇది. ఆల్ ఇండియా వ్యవస్థలో ఇది ఉంది. న్యాయం చేయనీయరు పోలీసులను.. అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అన్నారు.
ఈ మెసేజ్ ను చక్కగా ఈ టైమ్ లో అంటే.. ఎన్నికల టైమ్ లో ఈ మెసేజ్ ను తీసుకెళ్లడం, ఆ సందర్భం మాకు కుదిరింది. పోయిన నెల విడుదల చేయాలని అనుకున్నాం కానీ.. ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి కదా. అందుకే ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. బన్నీ వాసు, విద్య, భాను, రియాజ్.. వీళ్లంతా మా వెనకాల ఉండి ఎంతో ప్రోత్సహించారు. ఈ కథ అనుకొనేటప్పుడు ఆ తర్వాత ఎడిటింగ్ రూమ్ లో తప్ప వీళ్లంతా నా వెనకాల ఉండి నడిపించారు. డబ్బులు కూడా పెడుతుంటారు. అందరూ హీరోలు, హీరోయిన్లను ఇంట్రడ్యూస్ చేస్తారు. అవన్నీ అయిపోయాయి. ఇప్పుడు నేను అనేక మంది ప్రొడ్యూసర్లను కూడా మన బ్యానర్ నుంచి తయారు చేసి పంపిస్తున్నాం. ఈ మధ్య బేబీ తీసిన వాళ్లు కూడా మన సంస్థలో నుంచే వచ్చారు. అట్లాగే ఇంకా చాలామంది నిర్మాతలను మన సంస్థ నుంచి పంపించాలని కోరుకుంటున్నాను.. అని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.
GST 2.0 : జీఎస్టీ శ్లాబుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా సంస్కరణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రధాని నరేంద్ర…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే…
Oneplus | ప్రీమియం లుక్, ఫీచర్స్ ఉన్న స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికీ మంచి సమయం ఇది. రూ.30,000 - రూ.40,000…
AP District Court Jobs | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా కోర్టు లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న…
Bigg Boss9 | తెలుగు ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రియాలిటీ షో ‘బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9’ సెప్టెంబర్…
Anushka Shetty | టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి చాలా గ్యాప్ తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై…
Allari Naresh | అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఆల్కహాల్. ఈ సినిమా మెహర్ రాజ్…
Water | ఉదయం లేవగానే చాలామందికి బ్రష్ చేయడం, తర్వాత వెంటనే నీళ్లు తాగడం అలవాటు. కానీ పెద్దవాళ్లు "బ్రష్ చేసిన…
This website uses cookies.