Allu Arjun : బాలీవుడ్ స్టార్‌తో అల్లు అర్జున్ ..భారీ ప్రాజెక్ట్ కన్‌ఫర్మ్..!
Allu Arjun : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తాజాగా చేసిన కామెంట్స్‌తో మన టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హిందీలో భారీ చిత్రం చేయనున్నట్టు అర్థమవుతోంది. తెలుగులో మహేశ్ బాబు మాదిరిగా హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటున్నారు ఖిలాడి హీరో అక్షయ్ కుమార్. మధ్యలో ఒకటీ రెండు సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఖాన్‌ల త్రయాన్ని గట్టిగా ఎదుర్కుంటూ సాలీడ్ హిట్స్ అందుకుంటున్నారు. నిర్మాతగా కూడా అక్షయ్ సక్సెస్‌లలో ఉన్నారు. తాజాగా ఆయన నటించిన హిందీ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది.
ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమాలో 2017 మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ హీరోయిన్‌గా నటించింది. అయితే, ప్రమోషన్స్‌లో భాగంగా అక్షయ్ కుమార్ మాట్లాడారు. ఈ సమయంలో ఆయన సౌత్ సినిమా, బాలీవుడ్ సినిమా అని వేరు చేసి మాట్లాడటం ఎంతమాత్రం కరెక్ట్ కాదని, ఇక్కడ సినిమాలు తెలుగులో హిట్ అవుతున్నాయని, అలాగే.. తెలుగు సినిమాలు హిందీలో రిలీజై హిట్ సాధిస్తున్నాయని చెప్పుకొచ్చారు. మనది ఇండియా..మన సినిమా ఇండియన్ సినిమా. భాషతో సంబంధం లేకుండా ఏ సినిమా హిట్ అయినా అది ఇండియన్ సినిమా అని గర్వంగా చెప్పుకోవాలి అన్నారు.

Allu Arjun Big project with Bollywood star hero Akshay Kumar
Allu Arjun: అల్లు అర్జున్ నాతో కలిసి సినిమా చేయాలి.
అంతేకాదు, ఇప్పుడు అన్నీ సినిమా ఇండస్ట్రీలలో మంచి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని ఒక భాషలో నటిస్తున్న వారు మిగతా భాషలలో కూడా అద్భుతమైన పాత్రలు చేస్తున్నారని తెలిపారు. ఫ్యాచర్‌లో అల్లు అర్జున్ నాతో కలిసి సినిమా చేయాలి. నేను అల్లు అర్జున్‌తో కలిసి సినిమా చేయాలి. అలా మనం ఆలోచించాలి అన్నారు. పుష్ప తర్వాత అల్లు అర్జున్‌కు హిందీ బెల్ట్‌లో భారీ క్రేజ్ దక్కింది. ఇప్పటికే అక్కడ స్ట్రైట్ సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు అల్లు అర్జున్. ఇక తాజాగా అక్షయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలతో ఖచ్చితంగా వీరిద్దరు కలిసి సినిమా చేస్తారని అర్థమవుతోంది.