Allu Arjun : పుష్ప పార్ట్ 1 సినిమాతో ఐకాన్ స్టార్‌గా మారారు అల్లు అర్జున్. ఈ సినిమాతో సౌత్ సినిమా ఇండస్ట్రీలతో పాటు బాలీవుడ్‌లో మంచి మార్కెట్‌ను ఏర్పరుచుకున్నారు. అందుకే, పుష్ప సీక్క్వెల్ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. ఇంకా ఈ సినిమా షూటింగ్ మొదలవకపోయినా కూడా పాన్ ఇండియా లెవల్‌లో వసూళ్ళ గురించి లెక్కలేసుకుంటున్నారు. అయితే, ఇప్పటికే అల్లు అర్జున్ కెరీర్‌లో కమిటైన సినిమాలు కొన్ని ఉన్నాయి. ఆ లైనప్‌లో ఇప్పుడు ఆర్డర్ మారబోతుందని తాజాగా టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాను చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ అధికారికంగాను ప్రకటించారు.
దీనికంటే ముందే దిల్ రాజు నిర్మాణంలో ఐకాన్ అనే సినిమాను ప్రకటించారు. దీనికి వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించాల్సి ఉంది. ముందు కమర్షియల్ సినిమాగా ప్లాన్ చేసినప్పటికీ పుష్ప పాన్ ఇండియా రేంజ్‌లో హిట్ అవడంతో మళ్ళీ అదే ఐకాన్ స్క్రిప్ట్‌ను పాన్ ఇండియా రేంజ్‌కు మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలీదు. దీన్ని బట్టి చూస్తే కొరటాల శివ, వేణు శ్రీరామ్ ప్రాజెక్ట్స్ అధికారికంగా బన్నీ కమిటైనవి. లెక్క ప్రకారం ఇవి ముందుకు పూర్తి చేయాల్సి. పుష్ప 2 తర్వాత కొరటాలతో గానీ, వేణూ తోగానీ సెట్స్ మీదకి రావాలి.కానీ, ఇప్పుడు ఈ ఆర్డర్ మారిందని టాక్ వినిపిస్తోంది.
అంతకముందు కార్తి హీరోగా తమిళంలో రూపొందించిన ఖైదీ సినిమాతోనే హాట్ టాపిక్ అయిన లోకేష్ కనగ రాజ్..ఆ తర్వాత మాస్టర్, ఇటీవల వచ్చిన విక్రమ్ సినిమాలతో సంచలన దర్శకుడిగా మారాడు. దాంతో యాక్షన్ సినిమా చేయాలనుకుంటున్న హీరోలందరూ లోకేష్ కథ చెప్తే అది గనక నచ్చితే ఓకే చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కూడా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నారట. ఇప్పటికే, ఇద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయని తెలుస్తోంది. మన టాలీవుడ్ హీరోలందరిలో కంటే అల్లు అర్జున్‌కి తమిళ, మలాయాళ, కన్నడ భాషలలో మంచి క్రేజ్ అండ్ మార్కెట్ ఉంది. అందుకే, బన్నీ కూడా లోకేష్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. త్వరలో అఫీషియల్ కన్‌ఫర్మేషన్ వస్తుందని సమాచారం.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.