Home » Entertainment » Shruti Haasan Seems To Have Fixed Them
Entertainment

Shruti Haasan : ఇక శృతి హాసన్ వారికి ఫిక్సైపోయినట్టేనా..?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: June 20, 2022, 9:00 pm
Advertisement

Shruti Haasan : విశ్వ నటుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ గురించి నెటిజన్స్ ఓ విషయంలో ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు. అదేమిటంటే ఇక శృతి హాసన్ సీనియర్ హీరోలకేనా అని. అవును..ఇటీవల ఆమె ఒప్పుకున్న సినిమాలను వాటిలో హీరోలను చూస్తే నెటిజన్స్ మాటే నిజమనుకోవాల్సి వస్తుంది. కమల్ కూతురుగా బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ సౌత్‌లో మంచి క్రేజీ హీరోయిన్‌గా పాపులారిటీని సాధించుకుంది శృతి హాసన్. కెరీర్ ప్రారంభంలో అమ్మడికీ అన్ని ఫ్లాప్సే వచ్చాయి. దాంతో ఇండస్ట్రీలో ఉన్న సెంటిమెంట్ ప్రకారం ఐరెన్ లెగ్ అనే ముద్ర పడింది.అయితే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాన్ని చెరిపేసి భారీ హిట్ ఇచ్చి అమ్మడి ఫేట్ మొత్తాన్ని మార్చేశారు.

Advertisement

ఈరోజు శృతి హాసన్ క్రేజీ హీరోయిన్‌గా ప్రభాస్ లాంటి గ్లోబల్ స్టార్‌తో పాన్ ఇండియా రేంజ్ సినిమాలో నటిస్తుందీ అంటే దానికి కారణం ఆరోజూ ఆయన దర్శకనిర్మాతలకు చెప్పిన మాటే. తెలుగులో ఓ మై ఫ్రెండ్, అనగనా ఓ ధీరుడు సినిమాలు చేసిన శృతి హాసన్ ఫ్లాప్స్ మూటగట్టుకుంది. తమిళంలో ధనుష్ సరసన చేసిన 3 కూడా పెద్ద డుజాస్టర్. ఆమె నటించిన మొదటి హిందీ సినిమా లక్కీ కూడా ఫ్లాపే. అందుకే, గబ్బర్ సింగ్ సినిమా నిర్మాత బండ్ల గణేష్ ఈ అమ్మాయిని హీరోయిన్‌గా వద్దనుకుంటున్నానని పవన్ కళ్యాణ్‌తో చెప్పాడు.కానీ, టాలెంట్‌ను మాత్రమే నమ్మే పవన్ ఒప్పుకోలేదు. గబ్బర్ సింగ్ సినిమాలో హీరోయిన్‌గా శృతి హాసన్‌నే తీసుకోమని సలహా ఇచ్చారు.

Shruti Haasan seems to have fixed them

Advertisement

Shruti Haasan : శృతి గ్రేట్ అని అభిమానులు చెప్పుకుంటున్నారు.

ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలవడంతో శృతి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. మధ్యలో మూడేళ్ళ గ్యాప్ వచ్చినా మళ్ళీ రవితేజ సరసన క్రాక్ సినిమా చేసి భారీ హిట్ అందుకొని సాలీడ్ రీ ఎంట్రీ ఇచ్చింది. అంతే, ఏకంగా ప్రభాస్ సరసన సలార్ అనే పాన్ ఇండియా సినిమాను, మెగా స్టార్ సరసన సినిమాను, బాలయ్య – గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇలా మూడు పెద్ద హీరోల సినిమాలు అది కూడా సీనియర్ హీరోలతో జతకట్టడంతో ఇక శృతి సీనియర్ హీరోలకే ఫిక్సైనట్టుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలు అవకాశాలు లేక ఆవురావురంటున్న వారికంటే సీనియర్ హీరోలతో జతకడుతూ అవకాశాలు అందుకుంటున్న శృతి గ్రేట్ అని అభిమానులు చెప్పుకుంటున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి