Home » Entertainment » Allu Arjun Hot Comments On Priyamani In Dhee Show
Entertainment

Allu Arjun : ‘ప్రియమణి యూ ఆర్ వెరీ హాట్’.. అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్!

Authored By
Breaking News 2
The Telugu News | Published on: December 3, 2021, 10:20 am
Advertisement

Allu Arjun పుష్ప సినిమా ఫైనల్ షెడ్యుల్ తో బిజీ బిజీగా గడిపిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ షూటింగ్ కు కాస్త బ్రేక్ ఇచ్చి ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షో గ్రాండ్ ఫినాలేకు స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యాడు. అభిమాన హీరోకు వెల్ కమ్ చెబుతూ ఎంట్రీలోనే కంటెస్టెంట్స్ అంతా పుష్ప సినిమా సాంగ్స్ పై స్పెషల్ పెర్ఫార్మెన్స్ తో ఢీ స్టేజ్ ని ఓ ఊపు ఊపేసారు. అయితే అదంతా ఓ ఎత్తైతే షో ఒకానొక జడ్జీ, నటి ప్రియమణిపై అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.కంటెస్టెంట్ ల పర్ఫార్మెన్స్ లతో, ప్రదీప్, సుధీర్, హైపర్ ఆదీల కామెడీని తెగ ఎంజాయ్ చేసిన అల్లు అర్జున్…

Advertisement

కాసేపటి తర్వాత అక్కడే ఉన్న ప్రియమణితో కాసేపు సరదాగా ముచ్చటించారు. మీతో వర్క్ చేయలేదనే బాధ తనకెప్పుడూ ఉంటుందని ఆమెతో అన్నారు. ఇప్పటికీ సమయం మించి పోలేదని మంచి అవకాశం మీతో నటించాలని అనుకుంటున్నట్లు తన మనసులో మాట బయట పెట్టేశారు. మరో అడుగు ముందుకేసి అందరూ చూస్తుండగానే మీరు ఒకప్పటి కంటే ఇప్పుడు సన్న బడి మరింత హాట్ గా తయారయ్యారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. బన్నీ వ్యాఖ్యలకు ఎలా స్పందించాలో అర్థం కానీ ప్రియమణి.. సిగ్గుతో ఓ చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు.

Allu Arjun comments on priyamani in dhee show

Advertisement

Allu Arjun ప్రియమణితో కలిసి నటించాలని ఉందన్న బన్నీ

బన్నీ నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప ఈ నెల 17 న ఐదు భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ఉన్న ప్రియమణి కొన్నేళ్ల పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత ఢీ షో ద్వారా జడ్జిగా మళ్ళీ ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల నారప్ప సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నారు. ప్రదీప్ హోస్ట్‌ గా వ్యవరిస్తున్న ఢీ 13 షోకు జడ్జీలుగా గణేష్ మాస్టర్, ప్రియమణి, పూర్ణ ఉన్నారు. వారితో పాటు ఈ సీజన్‌లో సుధీర్, ఆది, రష్మీ గౌతమ్, దీపికా పిల్లి టీమ్ లీడర్‌లుగా ఉన్నారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి