Allu Arjun : అల్లు అర్జున్‌పై పోలీస్ కేసు…. ఎందుకో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Allu Arjun : అల్లు అర్జున్‌పై పోలీస్ కేసు…. ఎందుకో తెలుసా?

 Authored By sandeep | The Telugu News | Updated on :11 June 2022,3:30 pm

Allu Arjun : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు.పుష్ప చిత్రంతో ఆయ‌న క్రేజ్ విదేశాల‌కు కూడా పెరిగింది. త్వ‌ర‌లో పుష్ప 2తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. ఒక‌వైపు సినిమాల‌లో న‌టిస్తూనే మ‌రోవైపు యాడ్స్‌లో న‌టిస్తుంది. అయితే ఇటీవ‌ల బన్నీ న‌టిస్తున్న యాడ్స్ కాంట్ర‌వ‌ర్షియ‌ల్‌గా మారుతున్నాయి. అల్లు అర్జున్ నటించిన ఓ కమర్షియల్ యాడ్‌పై కేసు నమోదు కావడం హాట్ టాపిక్ అయింది. ఇటీవల ఆయన శ్రీ చైతన్య విద్యాసంస్థల కోసం ఓ వ్యాపార ప్రకటనలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రకటన తప్పుదోవ పట్టించేలా ఉందని సామాజికి కార్యకర్త కొత్త ఉపేందర్‌రెడ్డి ఆరోపించాడు.

అంతేకాదు ఇందులో నటించిన అల్లు అర్జున్‌, తప్పుడు సమాచారం ఇచ్చిన శ్రీ చైతన్య విద్యాసంస్థలపై ఆయన అంబర్‌పేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇప్పటికే అల్లు అర్జున్ చేసిన రాపిడో యాడ్‌పై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య అల్లు అర్జున్ చేసిన రాపిడో యాడ్‌లో సిటీ బస్సుల గురించి చూపించడంపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అప్పట్లో ఫైర్ అయ్యారు. ఇది వెంటనే తొలగించక పోతే బన్నీపై, రాపిడో సంస్థపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో అల్లు అర్జున్ చేసిన జొమాటో యాడ్ కూడా వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే.

allu arjun in troubles

allu arjun in troubles

Allu Arjun : బ‌న్నీ బుక్క‌య్యాడుగా..

ఇలా బన్నీ చేసిన పలు యాడ్ షూట్స్ కాంట్రవర్సీ అవుతుండటం ఆయన అభిమానుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. అల్లు అర్జున్‌కి యాడ్ షూట్స్ పెద్దగా కలసిరావడం లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాగా పుష్ప మూవీతో ఒక్కసారిగా బన్నీ క్రేజ్‌ పెరిగిపోయింది. దీంతో ఆయనకు దేశవ్యాప్తంగా బ్రాండ్‌ వ్యాల్యు కూడా భారీగా పెరిగింది. దీంతో పలు వ్యాపార సంస్థలకు బన్నీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారాడు. వాణిజ్య ప్రకటనలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. అనేక బ్రాండ్లను ప్రమోషన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో బన్నీ తరచూ చేదు అనుభవం చూస్తున్నాడు. ఇప్పటికే జొమాటో, ర్యాపిడో ప్రకటనలో నటించి విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది