Allu Arjun : అల్లు అర్జున్ ఇటీవలి కాలంలో తెగ వార్తలలో నిలుస్తున్నారు. ఎక్కువగా వివాదాలతో వార్తలలో నిలుస్తూ ఉండే బన్నీ రీసెంట్‌గా అరెస్ట్ అయ్యాడు కూడా.ఐకన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ చంచల్‌గూడ జైలు నుంచి విడుదల అయిన వెంటనే భారీ బందోబస్తు మధ్య గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. తెలంగాణ హైకోర్టు ఆయనకు శుక్రవారం సాయంత్రమే నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 50 వేల రూపాయల పూచీకత్తును సమర్పించాలని ఆదేశించింది. అయినప్పటికీ- విడుదల ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల రాత్రంతా జైలులో గడపాల్సి వచ్చింది. ఈ పరిణామాన్ని అల్లు అర్జున్ తరఫు న్యాయవాది జీ అశోక్ రెడ్డి తప్పు పట్టారు. చంచల్ గూడ సెంట్రల్ జైలు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు. న్యాయపోరాటం చేస్తామని తేల్చి చెప్పారు. లీగల్‌గా ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయిస్తామని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే బన్నీ అరెస్ట్ విషయం తెలియగానే షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని హుటాహుటిన బన్నీ ఇంటికి వచ్చిన చిరంజీవి.. బన్నీ కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. ఆ తర్వాత వెంటనే చిక్కడపల్లి స్టేషన్‌కు చిరంజీవి వెళ్లాలనుకున్నారు. కానీ పోలీసులు వద్దని కోరటంతో అర్జున్ ఇంటి దగ్గరకు వెళ్లిన చిరంజీవి దంపతులు. శనివారం ఉదయం విడుదలైన బన్నీని నిన్న టాలీవుడ్ సినీప్రముఖులు పరామర్శించిన సంగతి తెలిసిందే. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు బన్నీ. మెగా ఫ్యామిలీతో కలిసి అల్లు అర్జున్ లంచ్ చేయనున్నారు. అనంతరం సంధ్య థియేటర్ ఘటన గురించి చిరంజీవితో మాట్లాడనున్నారు బన్నీ. పుష్ప 2 సక్సెస్ తరువాత తొలిసారి చిరంజీవిని కలుస్తున్నారు అల్లు అర్జున్.
ఇక పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు వచ్చి..ఏపీకి వెళ్లిపోయారు ..నిన్న రాత్రి హైదరాబాద్ కు వచ్చిన పవన్ కళ్యాణ్….ఈ రోజు ఉదయం విజయవాడకి తిరిగి వెళ్లిపోయారు. ఇందులో భాగంగానే… గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అయితే.. హైదరాబాద్ కు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్… ఇప్పటికీ అల్లు అర్జున్ కలిసి పరామర్శించలేదు. మళ్లీ ఏపీకి తిరిగి వెళ్లిపోయారు. దీంతో అల్లు కుటుంబం షాక్ లో ఉంది. మెగా ఫ్యామిలీ కి అల్లు ఫ్యామిలీకి పడడం లేదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చిరంజీవి- బన్నీ కలయిక చర్చనీయాంశంగా మారింది.
Pushpa 2 : అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం పుష్ప2. చిత్రంలో రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్ ప్రధాన…
Allu Arjun : అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం సంచలనంగా మారడం మనం చూశాం. దేశ వ్యాప్తంగా అల్లు అర్జున్…
Surya : కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే భార్య అంచనాలు…
Balakrishna Jana Reddy : రేవంత్ రెడ్డి ప్రభుత్వం దూకుడు మీద ఉంది. శుక్రవారం మొత్తం అల్లు అర్జున్ అరెస్ట్…
Breast Cancer : ప్రస్తుతం రొమ్ము క్యాన్సర్స్ వయసుతో సంబంధం లేకుండా వస్తున్నాయి. అ కాలంలో పీరియడ్స్ రావడం కూడా…
Mega Heroes : 12 గంటలు చంచల్ గూడా జైల్లో ఉన్న అల్లు అర్జున్ ని ఇండస్ట్రీ మొత్తం పలకరించేందుకు…
Mahalakshmi : లక్ష్మీదేవికి ఏ ఏ రకమైన పూలతో పూజలు చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో మనం తెలుసుకుందాం... లక్ష్మీదేవి…
Allu Arjun Bail : సంధ్యా థియేటర్ పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి…
This website uses cookies.