
Arya 3 Movie : ఈసారి ఆర్య 3 లో అల్లు అర్జున్ ఉండకపోవచ్చు..? దిల్ రాజు
Arya 3 Movie : టాలీవుడ్‌కు ఎన్నో విజయవంతమైన సినిమాలను అందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు, తన కుటుంబ సభ్యుడైన ఆశిష్‌ను హీరోగా స్థిరపరచాలనే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఇప్పటివరకు వచ్చిన రెండు సినిమాలు ‘రౌడీ బాయ్స్’, ‘లవ్ మి’ ఆశించిన విజయం అందుకోలేకపోయాయి. ‘రౌడీ బాయ్స్’కి కరోనా సమయంలో విడుదల కావడం వల్ల కలిగిన సమస్యలు, ‘లవ్ మి’ సినిమాకు ప్రేక్షకుల నుండి సరైన స్పందన రాకపోవడంతో నిరాశ ఎదురైంది…
Arya 3 Movie : ఈసారి ఆర్య 3 లో అల్లు అర్జున్ ఉండకపోవచ్చు..? దిల్ రాజు
“సెల్ఫిష్” సినిమా సుకుమార్ శిష్యుడి దర్శకత్వంలో రూపొందుతోంది అని తెలిపారు. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తయినప్పటికీ, అవుట్‌పుట్ అంతగా సంతృప్తికరంగా లేకపోవడం వల్ల సినిమాను తాత్కాలికంగా హోల్డ్‌లో పెట్టామని తెలిపారు. అన్ని అంశాలు సరిగా సెట్ అయిన తర్వాత మాత్రమే మళ్లీ షూటింగ్ కొనసాగిస్తామని చెప్పారు. తక్కువ కస్టుతో చేయలేని కథ కావడంతో పూర్తి నిబద్ధతతో చేయాలన్నదే తమ అభిప్రాయమని స్పష్టం చేశారు.
‘ఆర్య-3’ టైటిల్ రిజిస్టర్ చేసిన విషయాన్ని దిల్ రాజు ధ్రువీకరించారు. సుకుమార్, తాము కలిసి ఒక ఐడియాను అభివృద్ధి చేయాలనుకున్నామని, కానీ పూర్తి కథ ఇంకా రెడీ కాలేదని అన్నారు. ఇది అల్లు అర్జున్‌తో చేయాలా, ఆశిష్‌తో చేయాలా అనే అంశం స్క్రిప్టు తుదిరూపాన్ని బట్టి నిర్ణయిస్తామన్నారు. ఇక ఆశిష్ త్వరలో ‘దేత్తడి’ అనే సినిమా చేయబోతున్నాడు. ఇది దిల్ రాజు బ్యానర్‌లో రూపొందనుండగా, మరో కొత్త సినిమా కూడా ఓకే అయిందని, అది బయటి బ్యానర్‌లో నిర్మాణం కాగలదని వెల్లడించారు. ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్టులు స్క్రిప్ట్, ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్నాయని తెలిపారు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.