Allu Arjun : అల్లు అర్జున్ ప్రెస్ మీట్ .. ఫ్యాన్స్ మధ్య వివాదాలు తారాస్థాయికి ?
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. పుష్ప మూవీ టీంతో ఈ మేరకు ఆయన అధికారిక ప్రకటన చేయించాడు. యూట్యూబ్ ఛానల్ లో కూడా ఈవెంట్ ని షెడ్యూల్ విడుదల చేశారు. డిసెంబర్ నెలలో విడుదల అవ్వబోతున్న ‘పుష్ప 2 : ది రూల్’ కి సంబంధించి కీలక ప్రకటన ఈ ప్రెస్ మీట్ ద్వారా అల్లు అర్జున్ తెలుపనున్నట్లు సమాచారం. అయితే అల్లు అర్జున్ మీడియా ముందుకు వచ్చి చాలా కాలం అయ్యింది. నంద్యాల పర్యటన తర్వాత అల్లు అర్జున్ పై పవన్ కళ్యాణ్ అభిమానుల్లో, మెగా అభిమానుల్లో ఆయనపై తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. ఈ క్రమంలో గడిచిన నాలుగు నెలలుగా అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ లో విభేదాలు సోషల్ మీడియా వేదికగా కొనసాగుతున్నాయి. ఇటు పవన్ కళ్యాణ్, అటు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా అల్లు అర్జున్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ వివాదం ఇలా కొనసాగుతూనే ఉన్నది.
వీటన్నింటిని నేపథ్యంలో అల్లు అర్జున్ మీడియా ముందుకు వస్తే రిపోర్టర్స్ గత సంఘటనలపై ప్రశ్నలు సందించే అవకాశం ఉంది. దేనికైనా సూటిగా స్పందించే అల్లు అర్జున్ అభిమానుల మధ్య గొడవ సద్దుమనిగేలా చేస్తాడా? లేక పెంచే విధంగా చేస్తాడా అనేది అంతా వేచి చూస్తున్నారు. వివాదాలకు ఫుల్‌స్టాప్ పెట్టేలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ని ముఖ్య అతిథిగా ఆహ్వానించే అవకాశం కూడా ఉందని అంతా చర్చించుకుంటున్నారు.
Allu Arjun : అల్లు అర్జున్ ప్రెస్ మీట్ .. ఫ్యాన్స్ మధ్య వివాదాలు తారాస్థాయికి ?
పుష్ప చిత్రం డిసెంబర్ 6న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే నిర్మాతలు అధికారిక ప్రకటించారు. అయితే ఇప్పుడు డిసెంబర్ 5నే విడుదల చేసేందుకు సిద్దమైనట్లు సమాచారం. మూవీ ఫస్ట్ హాఫ్ కి సంబంధించిన ఇప్పటికే వర్క్ మొత్తం పూర్తి అయ్యింది. ఎడిటింగ్, డబ్బింగ్, రీ రికార్డింగ్ కూడా పూర్తి చేశారు. సెకండ్ హాఫ్ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ హై స్పీడ్ లో కొనసాగుతున్నాయి. నవంబర్ మొదటి వారం లోపు మొదటి కాపీ సిద్ధంగా ఉంటుందని సమాచారం.
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్బై చెబుతూ రాజీనామా చేసిన…
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
This website uses cookies.