Zodiac Signs : భారతీయులు దీపావళి పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. దీపావళి పండుగ అంటే దీపాల పండుగ. అలాగే అజ్ఞానంపై జ్ఞానం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక ఈ దీపావళి పండుగ. ఈ రోజున ప్రజలందరూ తమ ఇళ్లల్లో దీపాలతో పాటు రంగు రంగు విద్యుత్ దీపాలతో అందంగా అలంకరిస్తారు. అయితే దీపావళి పండుగ అనేది లక్ష్మీదేవికి ప్రసిద్ధి చెందినది కాబట్టి దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవిని మరియు గణపతిని పూజిస్తారు. లక్ష్మీదేవి యొక్క ప్రత్యేక ఆశీర్వాదాలు పొందడం కోసం ఇంట్లో సిరిసంపదలు మరియు సుఖశాంతులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవిని పూజించడం కోసం స్త్రీలు కొత్త బట్టలను ధరిస్తారు. ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం స్త్రీలను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో స్త్రీలు దీపావళి పండుగ రోజు వారి యొక్క రాశి ప్రకారం కొన్ని రంగు దుస్తులను ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఇంట్లో కీర్తి శాంతి లభిస్తుందని నమ్మకం. మరి ఏ రాశి వారు ఏ రంగు దుస్తులను ధరిస్తే విశేషమైన ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
మేష రాశి స్త్రీలు దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవిని పూజించడానికి ఎరుపు రంగు దుస్తులను ధరించాలి. ఇలా చేయడం వలన లక్ష్మిదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే వారి ఇంట్లో ఆనందం నెలకొంటుంది.
వృషభ రాశి స్త్రీలు దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవిని పూజించడానికి నీలం రంగు దుస్తులను ధరించడం మంచిది. ఒకవేళ నీలం రంగు లేకపోతే స్కై బ్లూ లేదా రాయల్ బ్లూ వంటి నీలం రంగుకు దగ్గరగా ఉండే దుస్తులు అయిన ధరించవచ్చు. ఇలా ధరించడం వలన లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు లభిస్తాయి. అలాగే ధన లాభం కలుగుతుంది.
మిధున రాశి : దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించడానికి మిధున రాశి వారు నారింజ రంగు దుస్తులను ధరించాలి.
కర్కాటక రాశి : దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవి పూజ సమయంలో ఆకుపచ్చని బట్టలను ధరించాలి. ఎందుకంటే కర్కాటక రాశి వారికి ఆకు పచ్చ రంగు అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది.
సింహరాశి : సింహరాశి వారు దీపావళి పండగ రోజున లక్ష్మీదేవిని పూజించడానికి బ్రౌన్ కలర్ దుస్తులను ధరించడం మంచిది. ఈ రంగు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.
కన్యారాశి : కన్య రాశి వారు దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవిని పూజించే సమయంలో తెల్లని బట్టలను ధరించాలి. దీనివలన ఆర్థిక లాభాలు ఉంటాయి.
తులారాశి : దీపావళి పండుగ రోజున తులా రాశి వారు లక్ష్మీదేవిని పూజించే సమయంలో పసుపురంగు దుస్తులను ధరించాలి. దీనివలన తులా రాశిలో శ్రేయస్సు పొందడానికి మరియు ఆర్థిక నష్టాన్ని నివారించడానికి సహాయపడుతుంది.
వృశ్చికరాశి : వృచ్చిక రాశి వారు దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించడానికి మెరూన్ రంగు దుస్తులను ధరించడం మంచిది. ఇలా చేయడం వలన వీరికి అన్ని శుభాలే జరుగుతాయి.
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారు లక్ష్మీదేవిని పూజించే సమయంలో ఉదా రంగు దుస్తులను ధరించాలి.
మకర రాశి : మకర రాశి వారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడం కోసం దీపావళి రోజున నీలం రంగు దుస్తులను ధరించాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు జీవితంలో సంతోషాలను పొందవచ్చు.
కుంభరాశి : దీపావళి రోజున లక్ష్మీదేవి అనుగ్రహ రాశి వారు గ్రే కలర్ దుస్తులను ధరించడం మంచిది. దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అలాగే వీరి జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు ఉంటాయి.
మీన రాశి : దీపావళి పండుగ రోజున మీన రాశి వారు లక్ష్మీదేవిని పూజించే సమయంలో గులాబీ రంగు దుస్తులను ధరించాలి. దీనివల్ల అమ్మ అనుగ్రహం లభిస్తుంది.
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
This website uses cookies.