Pushpa 2 The Rule Censor Report : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ Allu arjun నటించిన పుష్ప 2 Pushpa 2 Movie చిత్రం కోసం దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ కి కావలసిన అన్ని కార్యక్రమాలని నిర్మాతలు పూర్తి చేస్తున్నారు. పుష్ప 2 గురించి బయటకి వస్తున్న ప్రతి అంశం ఆడియన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈసారి పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ చేయబోయే హంగామా కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ చిత్రం ఆద్యంతం యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని.. ఈ సినిమాతో బన్నీ మరోసారి నేషన్ వైడ్‌గా తన మార్క్ వేసుకుంటాడని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.సినిమా మొత్తం 3 గంటల 22 నిమిషాల నిడివితో సుకుమార్ సెన్సార్ కి పంపారట. ఇందులో ఇక పెద్దగా మార్పులు ఉండవు. సెన్సార్ నుంచి సినిమాకి సంబంధించిన కొన్ని మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్ లీక్ అయ్యాయి. ఈ చిత్రం 3 గంటల 20 నిమిషాల లాంగ్ రన్ టైంతో ఉన్నప్పటికీ ఎక్కడా బోర్ కొట్టకుండా సుకుమార్ జాగ్రత్త పడ్డట్లు తెలుస్తోంది.
అంత రన్‌టైం ఉన్నప్పటికీ అసలు 3 గంటలపైగా ఉన్న సినిమా చూస్తున్న ఫీలింగ్ ఉండదట. ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేలా సుక్కు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు అని టాక్. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎమోషనల్ గా సాగుతుంది అని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ లో పుష్ప రాజ్, ఇతర పాత్రల మధ్య డ్రామా అద్భుతంగా పండినట్లు చెబుతున్నారు. మధ్యలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తుంది అని అంటున్నారు. సెకండ్ హాఫ్ మొత్తం రేసీ స్క్రీన్ ప్లే తో పరుగులు పెడుతుందట. సెకండ్ హాఫ్ లో మొత్తం 3 మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. ఆ మూడు యాక్షన్ సీన్స్ పై చిత్ర యూనిట్ ఒక రేంజ్ లో నమ్మకం పెట్టుకుని ఉన్నారు. ఫస్ట్ హాఫ్ లో ఒక యాక్షన్ ఎపిసోడ్, సెకండ్ హాఫ్ లో మూడు వర్కౌట్ అయితే బాహుబలి, కెజిఎఫ్, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలని అవలీల గా అధికమిస్తుంది అని నమ్మకంతో ఉన్నారు
Night Walking : ప్రతి ఒక్కరికి నిద్రపోయే ముందు తేలికపాటి నడక అనేది శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. అలాగే ఇది మంచి…
Loan : మహిళలు కచ్చితంగా ఈ విషయాన్న్ని తెలుసుకోవాలి. లేదంటే మాత్రం కచ్చితంగా ఇబ్బందుల్లో పడతారు. పధాన మంత్రి ఉపాదన…
Old Currency Notes : కొందరికి అరుదైన పాత నోట్లు ఆచుకునే అలవాటు ఉంటుంది. తరాలు మారుతున్నా కొద్దీ ఈ…
Healthy Skin : ప్రస్తుత కాలంలో ప్రతి వ్యక్తి కూడా తమ సుదీర్ఘ జీవితాన్ని కోరుకుంటాడు. అయితే ఎవరైనా యవ్వనంగా ఉన్నప్పుడు…
Telangana : తెలంగాణాలో పరిపాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 7కి ఏడాది పాలన ముగిస్తారు. ఈ ఏడాది కాలంలో…
Honey : శీతాకాలంలో నిత్యం ఉదయన్నే పరిగడుపున ఒక టీ స్పూన్ తేనెను తీసుకుంటే ఏమవుతుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.…
Goddess Lakshmi : హిందూ సాంప్రదాయాలలో పురాణాలలో మరికొన్ని నమ్మకాల లో ఉప్పుకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఉప్పుని ఇతరులకు ఇవ్వడం…
Railway Jobs : దక్షిణ మధ్య రైల్వే స్కౌట్స్ మరియు గైడ్స్ కోటాలో గ్రూప్-సి, గ్రూప్-డి పోస్టుల భర్తీకి అర్హులైన…
This website uses cookies.