
Pushpa 2 Teaser : పుష్ప 2 మూవీ టీజర్‌తో పిచ్చెక్కించిన అల్లు అర్జున్.. బర్త్ డే రోజు మంచి ఎంటర్‌టైన్ అందించారుగా..!
Pushpa 2 Teaser : పుష్ప.. పుష్పరాజ్ ఈ పాత్ర బన్నీని ఐకాన్ స్టార్ చేసింది. ఒకప్పుడు సాదా సీదా హీరోగా ఉండే అల్లు అర్జున్ ఇప్పుడు బాలీవుడ్‌ని సైతం షేక్ చేస్తున్నాడు. పుష్ప సినిమాతో ప్రభంజనం సృష్టించిన బన్నీ ఇప్పుడు పుష్ప 2తో అరాచకం సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటించగా ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. పుష్ప సినిమాతో బన్నీ, రష్మిక, సుకుమార్‌కి దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కింది. ఇప్పుడు పుష్ప2తో గ్లోబల్ స్థాయిని కూడా అందుకోవాలని భావిస్తున్నారు. ఆగస్ట్ 15న పుష్ప2 చిత్రాన్ని విడుదల చేయనుండగా, గత కొద్ది రోజులుగా మూవీకి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఈ రోజు అల్లు అర్జున్ బర్త్ డే కాగా, కొద్ది సేపటి క్రితం టీజర్ విడుదల చేశారు. ఇందులో బన్నీ లుక్ కేక పెట్టిస్తుంది. ఫెరోషియస్‌గా, పవర్‌ఫుల్‌గా తన లుక్‌తో ఎంతగానో ఆకట్టుకున్నారు. ప్రతి ఫ్రేమ్ కట్టిపడేస్తుంది. ఇక బన్నీ చెప్పిన డైలాగ్స్ అయితే ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్నాయి. టీజర్ చూస్తే మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని అర్ధమవుతుంది. గత కొద్ది రోజులుగా సుకుమార్ ఈ మూవీ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. మొదటి పార్ట్‌ని మించిపోయేలా సినిమా చేస్తున్నాడు. సీజీ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ పనులపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నాడు. పుష్పతో నేషనల్ అవార్డ్ ఈ చిత్రానికి దక్కగా, పుష్ప2తో ఆయన మరిన్ని అవార్డులు అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Pushpa 2 Teaser : పుష్ప 2 మూవీ టీజర్‌తో పిచ్చెక్కించిన అల్లు అర్జున్.. బర్త్ డే రోజు మంచి ఎంటర్‌టైన్ అందించారుగా..!
ఇక నేడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడంతో నిన్న రాత్రి నుంచి అభిమానులు పెద్ద హంగామా చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పలువురు అభిమానులు, ప్రముఖులు, నెటిజన్స్ బన్నీకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నేషనల్ అవార్డ్ దక్కిన తర్వాత బన్నీ జరుపుకుంటున్న తొలి బర్త్ డే ఇది కాగా, ఇది చాలా స్పెషల్‌గా మారింది. ఇక ఇటీవల టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహం కూడా పెట్టారు. ఇక బన్నీ బర్త్ డే సందర్భంగా గత రాత్రి అభిమానులు ఆయన ఇంటికి వెళ్లి తెగ రచ్చ చేశారు. ఇంటి ముందు భారీగా చేరుకొని అరుపులు, విజిల్స్ తో హడావిడి చేశారు. దీంతో అల్లు అర్జున్ అర్ధరాత్రి అభిమానుల కోసం బయటకి వచ్చి వారికి అభివాదం చేశారు.
IPL 2026 RCB vs SRH : ఐపీఎల్ 2026 IPL 2026 సీజన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు RCB…
Chicken Price Drop : ఆదివారం వస్తే చాలు ముక్క లేనిదే ముద్ద దిగని నాన్-వెజ్ ప్రియులకు ఇది నిజంగా…
Gold Silver Rate 29th March 2026 : బంగారం కొనుగోలు చేయాలనుకునే పసిడి ప్రియులకు ఇది నిజంగా షాకింగ్…
pachhi chintapandu rasam recipe : పచ్చి చింతకాయలతో తయారుచేసే రసం అనేది మన తెలుగు ఇంటి వంటల్లో ఒక…
Coffee On Empty Stomach : చాలా మంది ఉదయాన్నే నిద్రలేవగానే కాఫీతో తమ రోజును ప్రారంభిస్తారు. ఇది సాధారణంగా…
Health : వాము ఆకులు మనకు అందుబాటులో ఉండే సాధారణ మొక్కలలో ఒకటి అయినప్పటికీ వాటి ఔషధ విలువలు చాలా…
Gold : ప్రస్తుత రోజుల్లో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరూ బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఎంతో ఆసక్తి…
Harsha Veena : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా హర్ష వీణ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. సోషల్…
RK Roja : ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా చుట్టూ ఇప్పుడు…
Prabhas vs Dhurandhar : తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటిన సినిమా బాహుబలి 2. ముఖ్యంగా అమెరికా బాక్సాఫీస్…
Students : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం మరియు వారి విద్యా భవిష్యత్తుపై కూటమి ప్రభుత్వం ఒక కీలకమైన…
Viral video : భారత క్రికెట్ స్టార్, ఆర్సీబీ కీలక బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరు మరోసారి సోషల్ మీడియాలో…
This website uses cookies.