Allu Arjun : మాల్దీవుల్లో సేద తీరుతున్న అల్లు ఫ్యామిలీ.. సోషల్ మీడియాలో పిక్స్ వైరల్..!
Allu Arjun : సమ్మర్ వచ్చిందంటే సెలబ్రిటీస్ అంతా బీచ్‌లలో సందడి చేసేందుకు బయలుదేరతారన్న సంగతి తెలిసిందే. ఇంతక ముందు సినిమా తారలంతా దాదాపు గోవా లేదా బ్యాంకాక్‌లకి వెళ్ళేవారు. కానీ గత ఏడాదిగా చూస్తే ప్రతీ ఒక్కరు మాల్దీవులకి వెళ్ళడం ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్ళి తర్వాత హనీమూన్ కి ఇక్కడికే వెళ్ళి దాదాపు ఓ 20 రోజుల పాటు ఎంజాయ్ చేసి వచ్చింది. అదే సమయంలో సమంత అక్కినేని కూడా భర్త నాగ చైతన్యతో మాల్దీవుల్ని చుట్టేసి వచ్చింది.
ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ తన బాయ్ ఫ్రెండ్ తో మాల్దీవుల్లో ప్రత్యక్షమయింది. అలాగే మరికొందరు బాలీవుడ్ స్టార్స్ కూడా మాల్దీవుల్లో ఎంజాయ్ చేసి వచ్చారు. కాగా రీసెంట్ గా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య అల్లు స్నేహలతరెడ్డితో కలిసి మాల్దీవుల్లో సరదాగా సమ్మర్ వెకేషన్ కి వెళ్ళాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ – స్నేహలతరెడ్డి అక్కడే సమ్మర్ కి సేద తీరుతున్నారు. ఈ సందర్భంగా అక్కడ దిగిన కొన్ని లేటెస్ట్ ఫొటోలని సోషల్ మీడియా ద్వారా అభిమానులకి పంచుకున్నారు.
Allu Arjun : మాల్దీవుల్లో మాత్రం కాస్త ట్రెండీగా కనిపించి సర్‌ప్రైజ్ చేసిన స్నేహలతా రెడ్డి ..!
ప్రస్తుతం ఈ పిక్స్ నెట్‌లో హల్‌చల్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇక నెటిజన్స్ ఈ పిక్స్ చూసి ఫ్రెండ్స్ కి షేర్ చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ ముందు నుంచి ఫ్యామిలీకి ఎక్కువ సమయం కేటాయిస్తాడని తెలిసిందే. ఎలాంటి ఫ్యామిలీ లేదా పబ్లిక్ ఫంక్షన్ అయినా భార్య తోడు తప్పకుండా ఉండాల్సిందే. అయితే ఎప్పుడు చాలా డీసెంట్‌గా కనిపించే స్నేహలతా రెడ్డి ప్రస్తుతం మాల్దీవుల్లో మాత్రం కాస్త ట్రెండీగా కనిపించి సర్‌ప్రైజ్ చేసింది. ఇక వీరిని చూసిన వారంతా పర్ఫెక్ట్ కపుల్ అంటూ కితాబులిస్తున్నారు.