
allu arjun speech at allu ramalingaiah 100th birthday
Allu Arjun : అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా శనివారం ఉదయం అల్లు స్టూడియోస్( allu studios) ని ప్రారంభించడమే కాకుండా సాయంత్రం వేళ ఓ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కొంతమందికి అల్లు రామలింగయ్య గారి మెమెంటోలను అందచేశారు. టాలీవుడ్ లో అప్పటి కమెడియన్స్, క్యారక్టర్ ఆర్టిస్ట్ లతో పాటుగా మరికొంతమంది సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి, త్రివిక్రం లతో పాటుగా అల్లు ఫ్యామిలీ మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొని సక్సెస్ చేశారు.
ఇక ఈ సందర్భంగా తాతతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు అల్లు అర్జున్. తను 16 ఏళ్ల వయసు దాకా నాయనమ్మ, తాతయ్యల దగ్గరే పెరిగానని అన్నారు అల్లు అర్జున్. తనంటే వారికి ఎంతో ఇష్టమని అన్నారు. అయితే మనవళ్లు.. మనవరాళ్లు దాదాపు 11 మంది ఉండగా తాతయ్య చనిపోతూ తనకు 10 లక్షల బాండ్ ఒకటి వచ్చిందని. అంతమంది ఉండగా తనకే అది ఎందుకొచ్చాయని ఆరా తీస్తే.. తన నాలుగవ తరగతిలో తాను ఎందుకు పనికిరాను అనుకున్న ఆయన తన కోసమే డిపాజిట్ చేశారు. ఆయన మరణించిన తర్వాత 10 లక్షలు తనకు వచ్చాయని అన్నారు అల్లు అర్జున్.
allu arjun speech at allu ramalingaiah 100th birthday
కార్యక్రమంలో భాగంగా తన తాతతో పనిచేసిన వారదరికి.. తాతకి అవకాశం ఇచ్చిన దర్శకులకి.. నిర్మాతలకి కూడా తన కృతజ్ఞతలు తెలియచేశారు అల్లు అర్జున్. ఆయన పనికిరాడు అనుకుని ఇచ్చాడో.. ఇతనే అల్లు బ్రాండ్ ని కొనసాగిస్తాడని ఇచ్చాడో కానీ అల్లు రామలింగయ్య గారి దివ్య ఆశీస్సులతో అల్లు అర్జున్ ఇప్పుడు నేషనల్ స్టార్ గా దుమ్ముదులిపేస్తున్నాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటిన అల్లు అర్జున్ పుష్ప 2 తో మరోసారి తన స్టామినా చూపించాలని ఫిక్స్ అయ్యాడు. పుష్ప 2 తర్వాత కూడా ఇక తను చేసే ప్రతి సినిమా పాన్ ఇండియా రేంజ్ లోనే ప్లానింగ్ లో ఉన్నాడు బన్నీ. తన నెక్స్ట్ సినిమా త్రివిక్రం డైరక్షన్ లో ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలో రానుంది. ఈ కాంబినేషన్ ని కూడా హారిక హాసిని బ్యానర్ లోనే మూవీ వస్తుందని తెలుస్తుంది.
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
This website uses cookies.