Allu Arjun : తనని ట్రోల్ చేసిన వారికి గట్టి కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్ .. !!

Authored By aruna | The Telugu News | Published on: November 14, 2023, 9:00 pm
  •  Allu Arjun : తనని ట్రోల్ చేసిన వారికి గట్టి కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్ .. !!

  •  అల్లు అర్జున్ మంగళవారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నారు

రీసెంట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మంగళవారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఆ ఈవెంట్ లో పుష్ప 2 సినిమా గురించి మాట్లాడారు. పుష్ప 2 సినిమాలో గంగమ్మ తల్లి జాతర పోస్టర్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం దానికి సంబంధించిన షూట్ ను రామోజీ ఫిలిం సిటీ లో చిత్రీకరిస్తున్నామని, ఆ సెట్ నుంచి నేరుగా ఇక్కడికి వచ్చాను అని చేతులకు ఉన్న పారాణిని అల్లు అర్జున్ చూపించారు. ఈ సినిమా వచ్చే సంవత్సరం రిలీజ్ అవుతుందని అన్నారు.

ఇక మంగళవారం సినిమాను నిర్మించిన స్వాతి తనకు ఫ్రెండ్ అని, ఆ సినిమా గురించి తన వద్ద చర్చించారని తనకు సపోర్ట్ చేస్తానని అల్లు అర్జున్ చెప్పారట. ప్రస్తుతం ఆ ఈవెంట్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంత క్రేజ్ ను సంపాదించుకుందో అందరికీ తెలుసు. సుకుమార్ , అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేసింది. అంతేకాకుండా అల్లు అర్జున్ కి ఇటీవల ఈ సినిమా నుంచి ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు కూడా వచ్చింది.

ఈ క్రమంలోనే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. అయితే మొదట్లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ను చాలామంది ట్రోల్ చేశారు అతని హీరో ఏంటి అని కామెంట్స్ చేశారు. అయితే మంగళవారం ఈవెంట్లో పాల్గొన్న అల్లు అర్జున్ మాట్లాడుతూ నా మీద నాకు నమ్మకాన్ని ఇచ్చింది అభిమానులే అని, వాళ్లే నా ఇన్స్పిరేషన్ అని ఆయన అన్నారు. తనమీద తనకి నమ్మకం లేకపోయినా సందర్భంలో అభిమానులు తనకు ఆ నమ్మకాన్ని ఇచ్చారని, ఇలానే మంచి మంచి సినిమాలు చేస్తూ మీరు అనుకున్న స్థాయికి వెళతానని ఆయన అన్నారు.

aruna

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp