Allu Arjun covid positive : కరోనా సెకండ్ వేవ్ దేశ వ్యాప్తంగా ప్రతి రోజు లక్షల కేసులు నమోదు అయ్యేలా చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ సెకండ్ వేవ్ తో ఎఫెక్ట్ అవ్వాల్సిందే అంటూ నిపుణులు చెబుతున్నారు. అదే జరుగుతున్నట్లుగా పరిస్థితిని చూస్తుంటే అనిపిస్తుంది. ప్రస్తుతం ప్రతి రోజు మూడున్నర లక్షలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. సెకండ్ వేవ్ లో భాగంగా టాలీవుడ్ ప్రముఖులు పలువురు కరోనా బారిన పడుతున్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు కరోనా బారిన పడి కొందరు కోలుకున్నారు మరి కొందరు కరోనాతో పోరాటం చేస్తూనే ఉన్నారు. తాజాగా అల్లు అర్జున్ కూడా కరోనా బారిన పడ్డాడు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించాడు. నాకు కరోనా పాజిటివ్ అంటూ వచ్చింది. ప్రస్తుతం నేను ఇంట్లోనే ఐసోలేట్ అయ్యి ఉన్నాను. నేను అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాను. చాలా స్పల్పంగా లక్షణాలు ఉన్నాయి. నాతో కాంటాక్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడ ఆ టెస్ట్ చేయించుకుని జాగ్రత్తగా ఉండాలన్నాడు. ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ ను తీసుకోండి. నా గురించి ఎలాంటి ఆందోళన వద్దని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేశాడు.
మొన్నటి వరకు పుష్ప సినిమా షూటింగ్ లో పాల్గొన్న అల్లు అర్జున్ కు ఆ సినిమా షూట్ సందర్బంగానే పాజిటివ్ వచ్చి ఉంటుందని అంటున్నారు. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ నిర్వహించినా కూడా వైరస్ వచ్చింది. అందుకే పలువురు హీరోలు మొత్తం షూటింగ్ ను రద్దు చేసుకుని ఇంటికే పరిమితం అయ్యారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమా షూటింగ్ బన్నీ కరోనా వల్ల తాత్కాలికంగా నిలిచి పోయింది. ఆగస్టులో సినిమాను విడుదల చేస్తామని సుకుమార్ నమ్మకంగా చెబుతున్నాడు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.