Allu arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఈ పేరు వింటే అభిమానులు పిచ్చెక్కిపోతారు. నటనలోనే కాకుండా డ్యాన్స్ పరంగాను మనోడికి ఇండస్ట్రీలో తిరుగులేదు. సోషల్ మీడియాలో టాప్ ఫాలోవర్స్ ఉన్న హీరోగా పేరు సంపాదించుకున్నాడు. సౌతిండియాలోనూ బన్నీ మూవీస్‌కు మంచి మార్కెట్ ఉంది. ఇక మరికొద్దిరోజుల్లోనే పాన్ ఇండియన్ స్టార్‌గా ఎదిగేందుకు దూసుకొచ్చేస్తున్నాడు.. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ‘పుష్ప ది రైజ్’ మొదటి భాగం డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రెండు భాగాలు తెరకెక్కించాడు డైరెక్టర్ సుకుమార్..
అల్లు అర్జున్‌కు స్టైలీష్ స్టార్ అనే బిరుదు ఆర్య-2 మూవీ తర్వాత వచ్చిందని అందరికీ తెలిసిందే. అప్పటిరకు మనోడు తన కెరీర్‌ను సినిమాల కోసం పణంగా పెట్టాడు. సినిమా సినిమాకు తనలోని వేరియేషన్స్ చూపించాడు. డ్యాన్స్, నటనలోనూ కింగ్ అనిపించుకున్నాడు. అల్లురామలింగయ్య మనువడిగా, మెగాస్టార్ చిరంజీవి అల్లుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బన్నీ చాలా కష్టపడి ఒక్కోమెట్టు ఎక్కుతూ ఇప్పుడు టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకడిగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఇండస్ట్రీలో ఎంతో మంది సీనియర్ హీరోలను తన టాలెంట్‌తో వెనక్కి నెట్టి ముందు వరుసలో నిలిచాడు. ప్రస్తుతం రూ. కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. అయితే, బన్నీ తన మొదటి సినిమాలో రూ.100 రెమ్యూనరేషన్ తీసుకున్నారంటే ఎవరైనా నమ్ముతారా? అవును ఇదే నిజం..
మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ చేసిన డాడీ సినిమాలో అల్లు అర్జున్ ఒక డ్యాన్స్ స్టూడెంట్‌గా చిరు వద్ద కోచింగ్ తీసుకుంటూ కనిపించాడు. అయితే, ఇందులో అతని పాత్ర కొద్ది నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఇందులో బన్నీ డ్యాన్స్ మెచ్చి దర్శకుడు రాఘవేంద్ర రావు రూ.100ను అల్లు అర్జున్‌కు ఇచ్చారట..ఇలా ప్రస్తుత ఐకాన్ స్టార్ తన తొలిసినిమాకు వంద రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయి నుంచి నేడు కోట్లు తీసుకునే వరకు ఎదిగాడు. అంతేకాకుండా సౌత్ ఇండియా మైకేల్ జాక్సన్ అనే బిరుదు కూడా సంపాదించుకున్నాడు అల్లు అర్జున్..
Kangana Ranaut : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి ఘోర పరాజయం తర్వాత, బాలీవుడ్ నటి, బిజెపి…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం మరి కొద్ది రోజులలో…
Ind Vs Aus : సొంత గడ్డపై దారుణమైన ఓటమిని తమ ఖాతాలో వేసుకున్న భారత India జట్టు ఇప్పుడు…
Health Benefits : పారిజాత మొక్క శాస్త్రీయంగా Nyctanthes arbor-tristis అని పిలుస్తారు. ఇది సువాసనగల, రాత్రిపూట పుష్పించే చెట్టు.…
Banana - Apple : అరటిపండు ఎంతో మధురంగా ఉంటుంది. అంతేకాదు ఈ పండులో ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.…
Kadaknath Chicken : నాటు కోళ్ళ పెంపకం ఇప్పుడు ఎంత లాభదాయకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న, సన్నకారు…
Postal Scheme : కేంద్ర ప్రభుత్వానికి చెందిన తపాల వ్యవస్థ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పూర్వం ఇది కేవలం…
Health Benefits : లోటస్ (తామర) ప్రధానంగా ఆసియాలో పండించే మొక్క. ఈ మొక్క యొక్క భాగాలు మరియు దాని…
This website uses cookies.