cricketer david warner becomes pushparaj
David warnar : ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తెలుగు క్రికెట్ అభిమానులకు చాలా క్లోజ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన ఐపీఎల్ లో సన్ రైజర్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సమయంలో టీం చాలా పటిష్టంగా ఉంది. ఒక్కడే జట్టును విజయతీరాలకు చేర్చేందుకు చాలా కష్టపడేవాడు. వార్నర్‌కు హైదరాబాద్ జట్టు అన్న.. హైదరాబాద్ బిర్యానీ అన్న ఇక్కడి అభిమానులు అన్న ఎంతో ఇష్టమంట.. అంతేకాకుండా మనోడు తెలుగు సినిమాల్లో వచ్చే సాంగ్స్‌కు తన దైన స్టైల్లో స్టెప్టులు కూడా వేసి ఓ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. గతంలో డేవిడ్ వార్నర్ అల వైకుంఠ పురంలో మూవీలోని బుట్టబొమ్మ పాటకు తన భార్యతో కలిసి స్టెప్పులేసి అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి తన టాలెంట్‌ను ప్రదర్శించాడు ఈ లెఫ్ట్ హ్యాండర్ హిట్టర్.. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప ది రైజ్ మూవీలో ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ సాంగ్‌లో అల్లు అర్జున్ ఫేస్ మార్పింగ్ చేసి తన ఫేస్‌ను యాడ్ చేశాడు.
cricketer david warner becomes pushparaj
ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై టీం ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా స్పందించారు. పుష్పరాజ్‌గా అవతారం ఎత్తిన డేవిడ్ వార్నర్ వీడియోను ఏకంగా 2 మిలియన్ పీపుల్ వీక్షించారు. లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.అయితే, ఈ వీడియోను వీక్షించిన విరాట్ కోహ్లీ, అల్లు అర్జున్‌లు తమదైన శైలిలో కామెంట్స్ చేశారు. ‘ఆర్ యూ ఓకే’ అని విరాట్ కోహ్లీ మెసేజ్ పోస్ట్ చేయగా.. దానికి ‘గొంతు పట్టేసినట్లుంది’ అంటూ వార్నర్ సరదాగా రిప్లై ఇచ్చారు. అదే విధంగా పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ స్పందిస్తూ ‘వార్నర్ బ్రదర్ తగ్గేదే లే’ అంటూ కామెంట్ పెట్టాడు.
ఏకంగా వార్నర్ సెలెబ్రిటీలతోనే మెప్పు పొందేలా తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంటున్నాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇకపోతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప ది రైజ్’ మూవీ పాన్ ఇండియా వైడ్‌గా డిసెంబర్ 17న విడుదలకు సిద్దంగా ఉంది. దీనిని తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ ఒకేసారి అనువాదం చేశారు. పుష్ప మూవీ విడుదలకు ముందే రూ.250 కోట్లకు పైగానే బిజినెస్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
This website uses cookies.