Allu Arjun Tweet About Fan War Of Mega And Allu Family
Allu Arjun : చిరంజీవి అడుగు జాడలలో ఎదుగుతూ వచ్చిన అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా మారిన విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా పరిస్థితులు చూస్తుంటే అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ అన్నచందాన మారింది. అల్లు అర్జున్ తన కెరీర్ మొదట్లో మెగా ఫామిలీ జపం చేసిన విషయం మెగాభిమానులు అంత త్వరగా మర్చిపోలేరు. అయితే అల్లు అర్జున్ రేంజ్ రానురాను పెరుగుతున్న క్రమంలో మెగా ఫామిలీ పేరునే మర్చిపోయే విధంగా ప్రవర్తిస్తున్నాడని ఓ వర్గం నిందిస్తోంది. గత సినిమాల ఆడియో ఫంక్షన్ లలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల తీరుకి అల్లు అర్జున్ ఒకింత అసహనానికి గురైన విషయం విదితమే.
మెగా – అల్లు కుటుంబాల మధ్య కోల్డ్ వార్ అనేది నడుస్తుందనే విషయం కొద్ది రోజులుగా హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇందులో నిజం మాట దేవుడికెరుకగాని… ఆ విషయం చెప్పి చెప్పి అది నిజమేనేమో అని భ్రమ కలిగేలా చేసారు. అయితే సందర్భానుసారంగా బన్నీ మెగాస్టార్ పట్ల తన అభిమానాన్ని చాటుకుంటూనే ఉంటాడు. అలాగే పవర్ స్టార్ అన్నా కూడా అదేవిధమైన విధేయతని చూపిస్తాడు బన్నీ. వారి మధ్య వైరానికి తావేలేదు. ఓ రకంగా అల్లు అర్జున్ వారికి బిడ్డలాంటివాడు. వారు కూడా అంతే ప్రేమను బన్నీపైన కురిపిస్తారు.కొద్ది రోజులుగా అల్లు వర్సెస్ మెగా వార్ నడుస్తున్న నేపథ్యంలో బన్నీ చిరంజీవికి విషెస్ చెప్పారు.
Allu Arjun Tweet About Fan War Of Mega And Allu Family
తన సోషల్ మీడియా ద్వారా చిరంజీవికి బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు బన్నీ. దీంతో మెగా ఫ్యాన్స్ తో పాటు అల్లు ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. వివాదాలు సద్దుమణిగినట్టే అని భావిస్తున్నారు.కాగా, సోషల్ మీడియాలో ఎవ్వరికైనా కామెంట్స్ పెట్టే స్వేచ్ఛ ఉండటంతో దారుణమైన పదజాలంతో రెచ్చిపోతున్నారు. అయితే తాజాగా మెగా కాంపౌండ్ హీరోలైన అల్లు అర్జున్, రామ్ చరణ్ ఫ్యాన్స్ నడుమ వార్ నడుస్తుండటం హాట్ టాపిక్ అయింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు రామ్ చరణ్‌ని తెగ ట్రోల్ చేస్తున్నారు. #GhantaLeniVarasudu అంటూ ఓ హ్యాష్ టాగ్ క్రియేట్ చేసి నెట్టింట రచ్చ చేస్తున్నారు. దీనిపై రామ్ చరణ్ అభిమానులు కూడా రంగంలోకి దిగి #ThammudiGhantaPhalAAm అనే హ్యాష్ టాగ్ తో బన్నీని అసభ్యకరంగా ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు వాటన్నింటికి పులిస్టాప్ పడ్డట్టేనా
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
This website uses cookies.