Allu Arjun : అల్లు అర్జున్ స్ట్రాంగ్ ప్లాన్ తో దిగాడు గా .. ప్రభాస్ , యష్ , షారూఖ్ కూడా షాక్ అయ్యారు !

Authored By aruna | The Telugu News | Published on: July 26, 2023, 6:15 pm

Allu Arjun : పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ సినిమా ఇండియా వైడ్ గా ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోని పాటలు, డైలాగ్స్ ఇప్పటికి కూడా వినిపిస్తున్నాయి. ఇక త్వరలోనే ఈ సినిమా రెండవ భాగం కూడా విడుదల కానుంది. పుష్ప2 తో ఇండియా వైడ్ గా రెట్టింపు అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ యూనిట్ లో కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పుష్ప సినిమా ప్లాన్ చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. కానీ అది ఎంతవరకు నిజమో క్లారిటీ రావాల్సి ఉంది. ఆ రేంజ్ లో కనుక రిలీజ్ చేసి సక్సెస్ అయితే నటుడిగా మరో రేంజ్ లో ఉంటారు.

ఇటీవలే ఓ యువ నిర్మాత బన్నీ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బన్నీ విజన్ వేరు, ఆయన ఆలోచన వేరు, భవిష్యత్తులో ఆయన రేంజ్ మారబోతుంది దేశాలు ఖండాలు దాటిన తెలుగు సినిమా నేపథ్యంలో బన్నీ ఇంకేదో కొత్తగా చేయబోతున్నట్లు ఆయన మాటల ద్వారా బయటపడింది. ఆ సమయంలో స్టేజి వద్దనే ఉన్న బన్నీ కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి. దీంతో యువ నిర్మాత మాటలకి బన్నీ కన్నీళ్ళకి ఏదో సంబంధం ఉన్నట్లు అభిమానులు గుర్తించారు. నిజంగానే బన్నీ ఇంకేదో చేస్తున్నారా అన్న సందేహం వస్తుంది. ప్రపంచ దేశాన్ని షేక్ చేసేలా బన్నీ అంత పెద్ద ప్లానింగ్ ఏం చేస్తున్నారా అని అభిమానులు ఆలోచిస్తున్నారు.

Allu Arjun upcoming world wide movie

Allu Arjun upcoming world wide movie

ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్స్ అయ్యారు. వాళ్లకి హాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి. ఇక ప్రభాస్ కు కూడా వరల్డ్ వైడ్ గా చాలామంది అభిమానులు ఉన్నారు. పుట్టినరోజు వస్తే ప్రత్యేకంగా ఆయా దేశాల్లో సెలబ్రేషన్స్ సైతం నిర్వహిస్తున్నారు. అయితే బన్నీ ఇంకా ఆ స్థాయిని చేరుకోలేదు. ఈ క్రమంలోనే బన్నీ తర్వాతి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాలని ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అనేది చూడాలి. పుష్ప టు సినిమాతో బన్నీ ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందుతాడా లేదా తన తర్వాతే సినిమాతో గుర్తింపు తెచ్చుకుంటాడా అనేది చూడాలి.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp