Home » Entertainment » Allu Arjun Vijay Devarkonda Multi Starer Plan By Talented Director
Entertainment

అల్లు అర్జున్ – విజయ్ దేవరకొండ తో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న టాలెంటెడ్ డైరెక్టర్.. !

Authored By
vamana sai
The Telugu News | Published on: January 25, 2021, 9:59 pm
Advertisement

అల్లు అర్జున్ – విజయ్ దేవరకొండ హీరోలుగా మల్టీస్టారర్ ప్లాన్ చేస్తారని ప్రేక్షకులే కాదు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఊహించి ఉండరు. టాలీవుడ్ లో అన్నీ రకాలుగా విజయ్ దేవరకొండ కంటే అల్లు అర్జున్ చాలా సీనియర్. మొదటి సినిమా గంగోత్రి తో హీరోగా గుర్తింపు పొందిన అల్లు అర్జున్ ఆర్య సినిమాతో స్టైలిష్ స్టార్ గా స్టార్ డం ని సాధించాడు. ఇప్పటివరకు ఎన్నో విభిన్నమైన కథల్లో నటించి సూపర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేట్ మార్కెట్ ని సంపాదించుకున్నాడు. అంతేకాదు గత ఏడాది అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్ సాధించాడు.

Advertisement

 

Advertisement

ఇక విజయ్ దేవరకొండ పెళ్ళి చూపులు సినిమాతో హీరోగా మారి అర్జున్ రెడ్డి తో స్టార్ హీరోగా విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఈ ఒక్క సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో మేకర్స్ ని ఆకట్టుకున్నాడు. అర్జున్ రెడ్డి లాంటి సినిమాతో పాటు గీత గోవిందం లాంటి డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ లో కూడా నటించగలడని ప్రూవ్ చేసుకోవడమే కాదు ఈ సినిమాతో 100 కోట్ల క్లబ్ లోనూ చేరాడు. ప్రస్తుతం డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తో లైగర్ అన్న పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా మీద భారీ అంచనాలున్నాయి.

Advertisement

కాగా అల్లు అర్జున్ కూడా పుష్ప అన్న సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ గా క్రేజ్ సాధించబోతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప కూడా అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా కావడం విశేషం. కాగా యాత్ర సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న మహి వి రాఘవ అల్లు అర్జున్ – విజయ్ దేవరకొండ హీరోలుగా మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్టు లేటెస్ట్ న్యూస్. ఇప్పటికే ఇద్దరికి అల్లు అర్జున్ – విజయ్ దేవరకొండ లకి కథ కూడా నరేట్ చేసినట్టు సమాచారం. ఇదే గనక నిజమైతే టాలీవుడ్ లో ఇదొక సెన్షేన్షల్ ప్రాజెక్ట్ ఖాయం అంటున్నారు. చూడాలి మరి ఇందుకు సంబంధించిన అఫీషియల్ న్యూస్ ఎప్పుడు వస్తుందో.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి