Home » Entertainment » Allu Arjun Wife Sneha Reddy Whatsapp Dp
Entertainment

Allu Sneha Reddy : అల్లు స్నేహారెడ్డి వాట్సప్ డీపీ ఇదే.. ఫోటో అదిరిందిగా

Authored By
aruna
The Telugu News | Published on: July 24, 2022, 4:30 pm
Advertisement

Allu Sneha Reddy : అల్లు స్నేహారెడ్డి నెట్టింట్లో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ భార్యగా స్నేహారెడ్డికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక బన్నీకి సంబంధించిన అప్డేట్లు ఇస్తుండటంతో ఆమెకు ఫాలోవర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వచ్చింది. ఏకంగా సౌత్ స్టార్ హీరోల భార్యల్లో నెంబర్ వన్ స్థానంలోకి వచ్చేసింది. మహేష్ బాబు భార్య నమ్రత, ఎన్టీఆర్ సతీమణి ప్రణీత, రామ్ చరణ్ వైఫ్ ఉపాసన ఇలా అందరిలోకెల్లా స్నేహారెడ్డికే ఎక్కువ మంది ఫాలోవర్లు రావడంతో అప్పట్లో హాట్ టాపిక్ అయింది

Advertisement

అలా స్నేహారెడ్డి క్రేజ్, ఫాలోయింగ్ రెండూ పెరుగుతూనే వస్తుంది. అయితే స్నేహారెడ్డి అప్పుడప్పుడు తన ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేస్తుంటుంది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంటుంది. తాజాగా స్నేహారెడ్డి ఇలానే ఓ చిట్ చాట్ సెషన్ పెట్టేసింది. ఇక నెటిజన్లు రకరకాల ప్రశ్నలు సంధించారు. అందులో ఎక్కువగా బన్నీ, అర్హ, అయాన్‌లకు సంబంధించిన ప్రశ్నలున్నాయి. వారంతా ఎలా ఉన్నారు అని అడుగుతుంటే.. అందరూ బాగానే ఉన్నారని స్నేహారెడ్డి రిప్లైలు ఇచ్చింది.

Allu Arjun Wife Sneha Reddy Whatsapp Dp

Advertisement

ఇక కొందరు స్కిన్ కేర్, హెయిర్ కేర్ గురించి ఇలా సౌందర్య చిట్కాలు అడిగారు. వాటికి కూడా స్నేహారెడ్డి సమాధానాలు ఇచ్చింది. ఇక కొందరు పర్సనల్ డేటాలను అడిగేశారు. వాట్సప్ డీపీ చూపించండని అడిగేశారు. దీంతో స్నేహారెడ్డి తన వాట్సప్ డీపీని షేర్ చేసింది. అందులో స్నేహారెడ్డి అదిరిపోయింది. మామూలుగానే ఈ మధ్య స్నేహారెడ్డి మోడల్‌లా ఫోటో షూట్లు చేస్తోంది. అది కూడా సమంత పర్సనల్ డిజైనర ప్రీతమ్ జుకాల్కర్ స్నేహారెడ్డి కోసం డిజైన్లు చేస్తున్నాడు. మొత్తానికి స్నేహారెడ్డి మాత్రం నెటిజన్లను ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది.

Allu Arjun Wife Sneha Reddy Whatsapp Dp

Advertisement

గత కొన్ని రోజులుగా బన్నీ ఫ్యామిలీ అంతా వెకేషన్లో ఉన్న సంగతి తెలిసిందే. వాటికి సంబంధించిన ఫోటోలను కూడా ఈ చిట్ చాట్ సెషన్‌లో స్నేహారెడ్డి బయటపెట్టేసింది. అక్కడ దిగిన ఫోటోలే తన ఫేవరేట్ పిక్స్ అని చెప్పుకొచ్చింది. మొత్తానికి బన్నీ భార్య మాత్రం నెట్టింట్లో దూసుకుపోతోంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి