Allu Arjun : అల్లు అర్జున్ ట్వీట్.. పవన్ కళ్యాణ్‌తో విబేధాలకి పులిస్టాప్ పడ్డట్టేనా?
ప్రధానాంశాలు:
Allu Arjun : అల్లు అర్జున్ ట్వీట్.. పవన్ కళ్యాణ్‌తో విబేధాలకి పులిస్టాప్ పడ్డట్టేనా?
Allu Arjun : గత కొద్ది రోజులుగా మెగా, అల్లు వార్ గురించి నెట్టింట తెగ చర్చ నడుస్తుంది. అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమని అభిమానులు కోరగా, అందుకు చెప్పను బ్రదర్ అని అన్నాడు బన్నీ. అప్పటి నుండి మెగా, అల్లు వార్‌కి సంబంధించిన అనేక వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అధ్యక్షుడి ఘన విజయం సాధించి కింగ్ మేకర్ అయ్యారు. అయితే పవన్, అల్లు అర్జున్ మధ్య గత కొన్నిరోజులుగా మాటల యుద్దం కొనసాగుతుంది. ఏపీ ఎన్నికల్లో అల్లు అర్జున్ జనసేనకు మద్దతు ఇవ్వకుండా వైసీపీ సపోర్ట్ చేయడం ఈ వివాదానికి తెరలేపింది. దీంతో మెగా ఫ్యాన్స్ అంతా బన్నీ వ్యవహారంపై మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా పలు రకాలు విమర్శలు కూడా చేశారు.
Allu Arjun చెక్ పడ్డట్టేనా ?
ఇక పవన్ గెలిచిన తర్వాత కూడా అల్లు అర్జున్ ఎక్కడా కూడా పవన్‌ను కలిసింది లేదు. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ కు అల్లు అర్జున్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయటం విశేషంగా మారింది. ‘‘హ్యాపీ బర్త్‌డే పవర్‌స్టార్, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ గారు’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ఇటీవల మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య అయితే వార్ తారస్థాయికి చేరుకుంది. సోషల్ మీడియా వేదికగా ఇరువురు అభిమానులు యుద్దం చేసుకుంటున్నారు. నాగబాబు అల్లు అర్జున్‌ను ఉద్దేశించి ట్వీట్ చేయడం, పవన్ కల్యాణ్ పరోక్షంగా అల్లు అర్జున్ గురించి మాట్లాడటం జరిగింది. ఇదే సమయంలో జనసేన ఎమ్మెల్యేలు సైతం అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప-2 సినిమా విడుదల అడ్డుకుంటామని హెచ్చరించారు.
ఈ క్రమంలో పుష్ప2 కూడా వాయిదా పడినట్టు ప్రచారం సాగింది. సాయి తేజ్ కూడా బన్నీని అన్‌ఫాలో చేశాడని, మెగా ఫ్యామిలీ నచ్చే ఏ పని బన్నీ చేయడం లేదంటూ నెట్టింట రచ్చ జోరుగా సాగింది. అయితే తాజాగా బన్నీ చేసిన ట్వీట్ అన్నింటికి చెక్ పెట్టిందని అంటున్నారు. ఇక పవన్‌కి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ‘‘వన్ అండ్ ఓన్లీ పవర్‌స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు మరెన్నో విజయాలు అందుకోవాలని.. ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నా. వినయం, అంకితభావంతో మీరు భారీ విజయాన్ని అందుకున్నారు. ఇలాగే ప్రజల కోసం సేవ చేయాలని కోరుకుంటున్నారు అని బన్నీ వాస్ ట్వీట్ చేశాడు.