Allu Arjun : కష్టపడటంలోనూ ‘తగ్గేదేలే’.. తెర మీదకు రెండేళ్ల అల్లు అర్జున్, సుకుమార్‌ల హార్డ్ వర్క్..
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌ల హ్యాట్రిక్ ఫిల్మ్ ‘పుష్ప’ఈ నెల 17న విడుదల కాబోతుంది. ఈ పాన్ ఇండియా మూవీ ఫైనల్ కాపీ రెడీ చేయడంలో ఎటువంటి మిస్టేక్ జరగకుండా చివరి వరకు డైరెక్టర్ సుకుమార్ ప్రయత్నిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ప్రమోషనల్ కార్యక్రమాలు పక్కనబెట్టి మరీ డైరెక్టర్ మిక్సింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. కాగా, బన్నీ ఈ చిత్రంలో ‘పుష్ప’ రాజ్ పాత్ర పోషించేందుకు పడ్డ కష్టాన్ని తాజాగా ఇంటర్వ్యూలో తెలిపాడు.సాధారణంగా మైథలాజికల్ పాత్రలు పోషించే సమయంలో చాలా రీసెర్చ్ చేస్తుంటారు యాక్టర్స్.
ఆ పాత్ర స్వభావం, బాడీ లాంగ్వేజ్ స్టడీ చేసి దానిని సిల్వర్ స్క్రీన్ పైన చూపించే ప్రయత్నం చేస్తుంటారు. కాగా, బన్నీఫిక్షనల్ క్యారెక్టర్ పుష్పరాజ్ కోసం కూడా అంతే స్టడీ చేశారు. కష్టపడటంలోనూ తగ్గేదేలే అని అన్నట్లుగా బన్నీ వెరీ హార్ట్ వర్క్ చేశాడు. అదంతా కూడా విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ప్రోమోస్ చూస్తుంటే అర్థమవుతోంది. సినిమాలో పాత్ర కోసం మేకప్ వేసుకోవడానికి రెండు గంటలు పట్టేదని ఈ సందర్భంగా బన్నీ చెప్పాడు.సినిమాలో స్పెషల్ ఎఫెక్ట్ కోసం భుజాన్ని అలా ఎత్తి ఉంచే విషయం అనుకున్నామని, అలా తాను సుకుమార్ డిస్కషన్‌లో అనుకున్న విషయం సినిమాలో బాగా వచ్చిందని చెప్పాడు.
Allu Arjun : అలా చేయడం వల్ల భుజం వెడల్పు తగ్గిందన్న అల్లు అర్జున్..
అయితే, సినిమా చేస్తున్నపుడు పర్ఫెక్షన్ కోసం సాయశక్తుల ప్రయత్నించానని, భుజం అలా ఎత్తి ఉంచడం వల్ల కొంచెం వెడల్పు తగ్గిందని, అయితే, ఫిజయోథెరపిస్ట్ సూచనల మేరకు పలు ఎక్సర్ సైజెస్ చేశానని బన్నీ చెప్పుకొచ్చాడు. డైలాగ్స్ చెప్పే క్రమంలో, ఫైట్ సీన్స్ , సాంగ్స్‌లో భుజాన్ని అలా ఎత్తి ఉంచుకోవడం చాలా కష్టమైందని బన్నీ పేర్కొన్నాడు. అయితే, బన్నీ, మెగా అభిమానులు ఆయన నెవర్ బిఫోర్ మాస్ అవతార్ చూసి చాలా ఆనందపడిపోతున్నారు. ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియ స్టార్ అవుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.