Allu Sneha Reddy : క్యూట్ బుట్టబొమ్మ.. అల్లు అర్హ పిక్ వైరల్
Allu Sneha Reddy బుల్లి బుట్టబొమ్మకు ప్రతిరూపంగా అల్లు అర్హ కనిపిస్తుంటుంది. ఆ జుట్టు, ఆ బుగ్గలు అన్నీ కలిసి అర్హను సోషల్ మీడియా సెన్సేషన్ చేసేశాయ్. ఇక నిహారిక అయితే ఏకంగా బుగ్గల అర్హ అనే పేరు పెట్టేసింది. అలా arha సోషల్ మీడియాలో తన చిలిపి చేష్టలతో చేసే అల్లరికి అందరూ ఫిదా అవుతుంటారు. అలాంటి అల్లు అర్హను పండుగలకు మరింత ప్రత్యేకంగా రెడీ చేస్తుంటారు. స్వాతంత్ర్య దినోత్సవం, దేశభక్తిని పెంపొందించేలా అల్లు పిల్లలకు స్పెషల్ గెటప్‌లు వేయిస్తుంటారు.

Allu Sneha Reddy shares arha pic
ఇక సినిమా ఈవెంట్లలో అర్హ కనిపిస్తే కెమెరాలన్నీ కూడా అటు వైపు తిరుగుతుంటాయి. పైగా అర్హకి కెమెరాలు, ఫోటోలు అంటే పిచ్చి అంటా. అందుకే ప్రతీసారి తన వద్దే ఉంటుంది.. తన వద్ద ఉంటే ఫోటోల్లో ఎక్కువగా కనిస్తానని అర్హకు తెలుసు అందుకే ఎప్పుడూ నాతోనే ఉంటుందని బన్నీ అసలు గుట్టు విప్పేశాడు. అలా అర్హకు ఫోటోలు అంటే మహా ప్రాణం. అందుకు తగ్గట్టే స్నేహా రెడ్డి సైతం అర్హను వెరైటీ వెరైటీ ఫ్యాషన్ దుస్తులను రెడీ చేస్తుంటుంది.
స్పెషల్ డిజైనర్ అర్హకు దుస్తులు : Allu Sneha Reddy
ఇంట్లో జరిగే ఫంక్షన్లు, ఈవెంట్లలో అర్హను స్పెషల్ డిజైనర్ దుస్తులతో రెడీ చేయిస్తుంటుంది. తాజాగా అలానే అర్హకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తులను వేసి రెడీ చేసింది. ప్రస్తుతం అర్హ ధరించిన ఆ డ్రెస్‌ను చూస్తే బుట్టబొమ్మ అని అనక తప్పదు. అల్లు వారి ఈ బుల్లి బొట్టబొమ్మను చూసి ప్రస్తుతం అందరూ ఫిదా అవుతున్నారు. ప్రతీ రోజు ఏదో ఒకలా ట్రెండింగ్‌లో ఉండే అల్లు వారి పిల్లలు ఇలా ఈ రోజు వెరైటీ డ్రెస్సింగ్‌తో అందరినీ కట్టిపడేస్తున్నారు.