amala paul shared interesting photos
Amala Paul : బ్యూటిఫుల్ హీరోయిన్ అమలా పాల్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంల భాషల్లో పలు చిత్రాలు చేస్తూ సత్తా చాటుతోంది. వైవిధ్యకరమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకుగాను అమలా పాల్ ఎప్పుడూ ప్రయత్నిస్తుంటుంది. ఈ భామ ‘లవ్ ఫెయిల్యూర్’ అనే చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల ఈ భామ నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు ఆంథాలజీ ‘పిట్టకథలు’లో నటించింది. ఇందులో అమలా పాల్ పోషించిన పాత్రకుగాను విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి.
amala paul shared interesting photos
అమలాపాల్ సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ ఇన్ స్టా గ్రామ్ వేదికగా తనకు సంబంధించిన ఫొటో ఒకటి షేర్ చేసింది. సదరు ఫొటోలో సిల్వర్ కలర్ డ్రెస్‌లో కొంటె చూపులతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోకు అమెరికన్ రచయిత గ్లెనన్ డొయలే కొటేషన్‌ను క్యాప్షన్‌గా ఇచ్చింది. ఆ క్యాప్షన్ ఏమిటంటే.. ప్రపంచాన్ని సంతోషంగా ఉంచడం అసాధ్యమని గ్రహించిన ఓ మహిళ చివరకు తనను తాను ఎలా సంతోష పెట్టుకోవాలో గ్రహించిందని, అలా స్వేచ్ఛగా తన కోసమే జీవిస్తుందనే వ్యాఖ్యలను ఈ ఫొటోకు అమలా పాల్ జత చేసింది.
amala paul shared interesting photos
ఇక ఈ ఫొటోను చూసి నెటిజన్లు సంతోషపడుతున్నారు. ‘బేబి, బ్యూటిఫుల్ ఔట్ ఫిట్, మై గార్జియస్ గాడెస్, డ్రెస్ బాగుంది’ అని కామెంట్స్ చేస్తున్నారు. అమలా పాల్ మోడ్రన్ డ్రెస్సులో అందంగా ఉంటుందని మరికొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అమలా పాల్ ప్రజెంట్ ‘ఆడు జీవితం, కడవీర్’ చిత్రాల్లో కథనాయికగా నటిస్తోంది.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.