Amala Paul : సిల్వర్ డ్రెస్‌లో అందాలు ఆరబోస్తూ కొంటె చూపులతో.. సెగ రేపుతున్న అమలా పాల్

Authored By mallesh | The Telugu News | Updated on : 19 October 2021, 8:45 pm

Amala Paul : బ్యూటిఫుల్ హీరోయిన్ అమలా పాల్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంల భాషల్లో పలు చిత్రాలు చేస్తూ సత్తా చాటుతోంది. వైవిధ్యకరమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకుగాను అమలా పాల్ ఎప్పుడూ ప్రయత్నిస్తుంటుంది. ఈ భామ ‘లవ్ ఫెయిల్యూర్’ అనే చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల ఈ భామ నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు ఆంథాలజీ ‘పిట్టకథలు’లో నటించింది. ఇందులో అమలా పాల్ పోషించిన పాత్రకుగాను విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి.

amala paul shared interesting photos

amala paul shared interesting photos

అమలాపాల్ సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ ఇన్ స్టా గ్రామ్ వేదికగా తనకు సంబంధించిన ఫొటో ఒకటి షేర్ చేసింది. సదరు ఫొటోలో సిల్వర్ కలర్ డ్రెస్‌లో కొంటె చూపులతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోకు అమెరికన్ రచయిత గ్లెనన్ డొయలే కొటేషన్‌ను క్యాప్షన్‌గా ఇచ్చింది. ఆ క్యాప్షన్ ఏమిటంటే.. ప్రపంచాన్ని సంతోషంగా ఉంచడం అసాధ్యమని గ్రహించిన ఓ మహిళ చివరకు తనను తాను ఎలా సంతోష పెట్టుకోవాలో గ్రహించిందని, అలా స్వేచ్ఛగా తన కోసమే జీవిస్తుందనే వ్యాఖ్యలను ఈ ఫొటోకు అమలా పాల్ జత చేసింది.

Amala Paul : ప్రపంచాన్ని సంతోషపెట్టడం అసాధ్యమంటున్న అమలా పాల్..

amala paul shared interesting photos

amala paul shared interesting photos

ఇక ఈ ఫొటోను చూసి నెటిజన్లు సంతోషపడుతున్నారు. ‘బేబి, బ్యూటిఫుల్ ఔట్ ఫిట్, మై గార్జియస్ గాడెస్, డ్రెస్ బాగుంది’ అని కామెంట్స్ చేస్తున్నారు. అమలా పాల్ మోడ్రన్ డ్రెస్సులో అందంగా ఉంటుందని మరికొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అమలా పాల్ ప్రజెంట్ ‘ఆడు జీవితం, కడవీర్’ చిత్రాల్లో కథనాయికగా నటిస్తోంది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి