
Amitabh Bachchan stunning comments on prabahs
Prabhas : ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో ప్రాజెక్ట్ కె ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ప్రాజెక్ట్ K’. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సీనియర్ నిర్మాత చలసాని అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా సక్సెస్‌తో దర్శకుడిగా అందరి దృష్టిని ఆకర్షించి.. ‘మహానటి’ వంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీని రూపొందించి ఎంటైర్ సినీ ఇండస్ట్రీని తన వైపు చూసేలా చేసుకున్ననాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. కొన్ని రోజులుగా ‘ప్రాజెక్ట్ K’ షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది.పాన్ ఇండియా మూవీగా కాకుండా ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ మూవీగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నామని ఇప్పటికే మేకర్స్ తెలిపారు.
సై ఫై మూవీగా ‘ప్రాజెక్ట్ K’ తెరకెక్కుతోందని టాక్ సినీ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. క్రేజీ కాంబినేషన్స్‌తో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్‌గా అమితాబ్ బచ్చన్, ప్రభాస్‌లపై కాంబినేషన్ సీన్‌ను చిత్రీకరించారు. దీనిపై ప్రభాస్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభాస్ స్పందిస్తూ ‘‘నా కల నిజమైంది. లెజెండ్రీ అమితాబ్ బచ్చన్ గారితో ఈరోజు నా తొలి సన్నివేశాన్ని పూర్తి చేశాను. చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు.అదే సమయంలో .. “మొదటి రోజు…మొదటి షాట్… బహుబలి ప్రభాస్‌తో మొదటి చిత్రం… ప్రతిభ, వినమ్రత కలిసి ఉన్న గొప్ప కళాకారుడు.. ఎప్పుడు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉంటాడు!!” అంటూ అమితాబ్ బచ్చన్ రాసుకొచ్చాడు. తాజాగా ..ఇప్పుడు ప్రభాస్ ఆతిథ్యం అందుకునే అవకాశం దక్కింది.
Amitabh Bachchan stunning comments on prabahs
బాహుబలి ప్రభాస్… నీ ప్రేమ కొలవలేనిది. నువ్వు తెచ్చిన భోజనం అత్యంత రుచికరమైంది. నువ్వు పంపిన క్వాంటిటీ చాలా ఎక్కువ. ఎంత ఎక్కువంటే సైన్యానికి పంచవచ్చు. స్పెషల్ కుకీస్ చాలా చాలా బావున్నాయి. నీ కాంప్లిమెంట్స్ అంత తేలిగ్గా జీర్ణం కావు అని ట్వీట్ చేశారు బిగ్ బి. మీడియా కథనాల ప్రకారం, భారతదేశంలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలలో ఇది ఒకటి నిలవనున్నట్లు తేలనుంది. గతేడాది డిసెంబర్‌లో తొలి షెడ్యూల్ చిత్రీకరించారు. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అమితాబ్, ప్రభాస్‌లతో పాటు దీపికా పదుకొణె కూడా కనిపించనుంది.
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
This website uses cookies.