Anand : సూర్య‌వంశం చైల్డ్ ఆర్టిస్ట్ చాలా పెద్ద‌య్యాడుగా.. హీరోగా ట్రై చేస్తున్నాడా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anand : సూర్య‌వంశం చైల్డ్ ఆర్టిస్ట్ చాలా పెద్ద‌య్యాడుగా.. హీరోగా ట్రై చేస్తున్నాడా..!

 Authored By ramu | The Telugu News | Updated on :22 July 2025,9:00 am

ప్రధానాంశాలు:

  •  Anand : సూర్య‌వంశం చైల్డ్ ఆర్టిస్ట్ చాలా పెద్ద‌య్యాడుగా.. హీరోగా ట్రై చేస్తున్నాడా..!

Anand  : జ‌గపతి బాబు Jagapathi babu, సౌందర్య, మహేశ్వరి నటించిన ‘ప్రియరాగాలు’ సినిమాలో సౌందర్య కుమారుడిగా ఆకట్టుకున్న ఆ బుడతడు గుర్తున్నాడా? అతడే ఆనంద్ హర్షవర్దన్. తన అమాయక ఎక్స్ ప్రెష‌న్స్ , సహజమైన నటనతో అప్పట్లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఈ బాల నటుడు ఇప్పుడు హీరోగా మళ్లీ తెరపై కనిపించేందుకు సిద్ధమవుతున్నాడు.

Anand సూర్య‌వంశం చైల్డ్ ఆర్టిస్ట్ చాలా పెద్ద‌య్యాడుగా హీరోగా ట్రై చేస్తున్నాడా

Anand : సూర్య‌వంశం చైల్డ్ ఆర్టిస్ట్ చాలా పెద్ద‌య్యాడుగా.. హీరోగా ట్రై చేస్తున్నాడా..!

Anand  లుక్ అదుర్స్..

ఆనంద్ ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు పీబీ శ్రీనివాస్ మనవడు. చిన్న వయసులోనే బాలరామాయణం (జూనియర్ ఎన్టీఆర్‌తో) సినిమాలో వాల్మీకి, బాల హనుమాన్ పాత్రలతో ప్రేక్షకులను అలరించాడు. అలాగే ‘సూర్యవంశం’ సినిమాలో వెంకటేశ్ కుమారుడిగా నటించాడు. మొత్తంగా అతను దాదాపు 25 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.

చదువు కోసం కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చిన ఆనంద్, ఇప్పుడు నటనపై మళ్లీ ఆసక్తితో రిటర్న్ అయ్యాడు. ప్రస్తుతం ‘నిదురించు జహాపనా’ అనే సినిమాతో హీరోగా రీ-ఎంట్రీ ఇస్తున్నాడు. సోషల్ మీడియాలోనూ చురుకుగా ఉంటూ తన ఫోటోలు, వీడియోలతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. స్మార్ట్ లుక్‌తో మాస్ అపీల్‌ కలిగిన హీరోగా మారాడు. సోషల్ మీడియాలో అతడి తాజా ఫొటోలు చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది