Ananya Nagalla : అన‌న్య నాగ‌ళ్ల.. మ‌రీ ఇంత క్యూట్ గా ఉంటే ఎలా.. కుర్రాళ్ల‌ను నిద్ర‌పోనియ్య‌వా..

Authored By mallesh | The Telugu News | Published on: June 21, 2022, 10:00 am

Ananya Nagalla : అన‌న్య నాగ‌ళ్ల ప‌క్కా తెలంగాణ అమ్మాయి.. అందుకే మ‌ల్లేశం సినిమాలో కీల‌క పాత్ర పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఫ‌ర్ ఫెక్ట్ ఫిగ‌ర్ తో అన‌న్య ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెంచుకుంది. ఇక ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌కీల్ సాబ్ సినిమాలో దివ్య‌వా నాయ‌క్ పాత్ర‌లో న‌టించి మ‌స్తు పాపులారిటీని సొంతం చేసుకుంది. అలాగే ప్లే బ్యాక్ అనే సినిమాలో కూడా హీరోయిన్ గా న‌టించింది. అలాగే నితిన్ మాస్ట్రో సినిమాలో కూడా మెరిసింది. సినిమాల‌తోనే కాకుండా ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియా ద్వారా మ‌స్తు ఫేమ్ ని సంపాదించుకుంది.

క్యూట్ లుక్స్ తో సోష‌ల్ మీడియాలో ఫొటోస్ పోస్ట్ చేయ‌డంతో క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతున్నాయి. ఖ‌మ్మం జిల్లా స‌త్తుప‌ల్లిలో పుట్టిన అన‌న్య హైద‌రాబాద్ లో ఇంజినీరింగ్ చ‌దివింది. ఇక కెరీర్ స్టార్టింగ్ లో షార్ట్ ఫిల్మ్ లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ ఫేమ్ తోనే వ‌రుస ఆఫ‌ర్ల‌తో బిజీగా ఉంటోంది. ప్ర‌స్తుతం అన‌న్య బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్ రియాన్ నటిస్తోన్న బూట్‌కట్ బాలరాజు సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ శాకుంతలం సినిమాలో కీల‌క పాత్ర‌లో నటిస్తోంది.

Ananya Nagalla cute looks viral in instagram

Ananya Nagalla cute looks viral in instagram

ఈ మూవీలో స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ పోషిస్తోంది. ఇక అన‌న్య సోష‌ల్ మీడియాలో వ‌రుస‌గా ఫొటోలు పోస్ట్ చేస్తూ కుర్ర‌కారుని క‌ట్టిప‌డేస్తోంది. అమాయ‌కంగా క‌నిపించే లుక్స్ తో మ‌తిపోగొడ‌తోంది. ప్ర‌స్తుతం అన‌న్య పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. రెడ్ టాప్ పొట్టి డ్రెస్ లో వ‌య్యారాల‌ను ఒల‌క‌బోస్తూ ఆక‌ట్టుకుంటోంది. క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ తో క‌ట్టిప‌డేస్తోంది. నెటిజ‌న్లు హాట్, ల‌వ్ సింబ‌ల్స్ తో బ్యూటిఫుల్ అంటూ తెగ పొగిడేస్తున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp