anasuya acts in kanyasulkam
Anasuya: అందాల ముద్దుగుమ్మ అనసూయ చాలా కాలం నుండి బుల్లితెరపై టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. ఈమె తన అందం, హాట్ లుక్స్ తో పలు షోలతో బిజీగా ఉన్న సమయంలోనే ఆమెకి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఇక అప్పుడప్పుడు కొన్ని స్పెషల్ సాంగ్స్ లో కూడా మెరుస్తుంటుంది అనసూయ . అయితే ఇటీవల ఈ బ్యూటీ అనసూయ తనకు మంచి ఫేమ్ తీసుకొచ్చిన ‘జబర్దస్త్’ షో నుంచి తప్పుకుందని తెలుస్తోంది. ఇదిలావుంటే సినిమాల పరంగా బిజీ అవ్వడమే దానికి కారణమని తెలుస్తోంది. ‘జబర్దస్త్’కి దూరమైన తరువాత వరుసగా సినిమాలు ఒప్పుకుంటుంది అనసూయ. తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తోంది ఈ బ్యూటీ.
రీసెంట్ గా రెండు తమిళ సినిమాలు, ఒక మలయాళ సినిమా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడో వెబ్ సిరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘కన్యాశుల్కం’ అనే వెబ్ సిరీస్ ను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గురజాడ అప్పారావు క్లాసిక్ నాటకం ఈ ‘కన్యాశుల్కం’.ఇది వెబ్ సిరీస్ రూపంలో తెరకెక్కనుందని, ఈ వెబ్ సిరీస్‌లో మధురవాణి అనే వేశ్య క్యారెక్టర్‌లో అనసూయ కనిపించనుందట. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే రానుంది. ఈ వెబ్ సిరీస్ మొత్తం అనసూయ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుందట.
anasuya acts in kanyasulkam
త్వరలోనే ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది. దర్శకుడు క్రిష్ ఈ సిరీస్ ను నిర్మించనున్నారు. ఈ మధ్యకాలంలో క్రిష్ దర్శకుడిగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయతే అనసూయతో క్రిష్ చేయబోతున్న ప్రయోగం మంచి సక్సెస్ సాధిస్తుందని అందరు భావిస్తున్నారు. ఇక మరోవైపు క్రిష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మిగతా భాగం షూటింగ్ని చాలా త్వరగా పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ దర్శకుడు క్రిష్ కి కండిషన్ పెట్టినట్లు కూడా సమాచారం
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
This website uses cookies.