Anasuya – Deepika Pilli : ఈటీవీని వీడి వెళ్లిన ఆ ఇద్దరు ముద్దుగుమ్మల పరిస్థితి దారుణం..!

 Authored By prabhas | The Telugu News | Updated on :15 October 2022,2:00 pm

Anasuya – Deepika Pilli : ఈటీవీ జబర్దస్త్ కార్యక్రమం వదిలి వెళ్ళి పోయిన కమెడియన్స్ కొందరు బాగానే సెటిల్ అయినా.. కొందరు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారు మళ్లీ జబర్దస్త్ లో అడుగు పెట్టేందుకు ఎంతగా ప్రయత్నిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. కేవలం కమెడియన్స్ మాత్రమే కాకుండా లేడీ యాంకర్స్ కూడా ఈటీవీ మల్లెమాల ని వదిలేసినందుకు కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఆ మధ్య దీపిక పిల్లి ఈటీవీ ని వదిలేసి స్టార్ మా కి వెళ్ళింది. అక్కడ కొన్ని రోజుల పాటు కామెడీ స్టార్స్ కార్యక్రమంలో సందడి చేసింది. ఏం జరిగిందో ఏమో కానీ చాలా తక్కువ సమయంలోనే ఆ కార్యక్రమాన్ని మూసి వేశారు.

ఒక సినిమాలో హీరోయిన్ గా కూడా నటించింది, ఆ సినిమా నిరాశ పరచడంతో హీరోయిన్ గా అవకాశాలు రావడం లేదు. బుల్లి తెరపై కనిపించే ఛాన్సు లు దొరకడం లేదు. దాంతో దీపిక పెళ్లి ఏం చేయాలో అర్థం కాక దిక్కులు చూస్తోంది. మరో వైపు జబర్దస్త్ అనసూయ కూడా చాలా కష్టాలను ఎదుర్కొంటుంది. జబర్దస్త్ కార్యక్రమం ప్రారంభమైన సమయంలో అనసూయ ఎవరికీ తెలియదు.. కానీ ఇప్పుడు ఆమె ఒక స్టార్ హీరోయిన్ రేంజ్ ని కలిగి ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి అనసూయ ఇటీవలే జబర్దస్త్ కార్యక్రమంలో వీడి వెళ్లి పోయింది. ఆమె స్టార్ మా కార్యక్రమంలో యాంకర్ గా, జడ్జిగా కనిపించాలని ఆశపడింది.

anasuya and deepika pilli feeling sad due to etv exit

anasuya and deepika pilli feeling sad due to etv exit

వారు భారీ పారితోషం ఇస్తారని అనుకున్నారు.. కానీ వారిద్దరూ కూడా స్టార్ మా కు వెళ్లి కొన్ని రోజుల్లోనే కనిపించకుండా కనుమరుగైతున్నారు. ముందు ముందు వారి గురించి జనాలు మరిచి పోయినా ఆశ్చర్యం లేదేమో, తెలుగు ప్రేక్షకులు అనసూయ ను ఎంతగా అభిమానించారో.. ఆదరించారో అందరికీ తెలిసిందే.. కానీ వారు మాత్రం స్టార్ మా కార్యక్రమాలకు వెళ్లి తమ కెరియర్ను తామే నాశనం చేసుకున్నారని.. వారిద్దరి పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉంది అంటూ బుల్లి తెర వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వారిద్దరూ మళ్లీ ఈటీవీలో రీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. కానీ అది మల్లెమాల ద్వారా సాధ్యమయ్యేది కాదు.

Also read

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి