Anasuya : అనసూయ కి ఇన్నాళ్ళకి జ్ఞానోదయం అయ్యిందా… ” చాలా పెద్ద తప్పు చేశా ” ఓపెన్ గా ఒప్పేసుకుంది !
Anasuya : జబర్దస్త్ యాంకర్ గా అనసూయ మంచి గుర్తింపు సంపాదించి ఒకపక్క బుల్లితెరపై మరోపక్క వెండి ధరపై ప్రజెంట్ దూసుకుపోతుంది. అంతేకాదు రెండు తెలుగు రాష్ట్రాలలో షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కార్యక్రమాలకు సంబంధించి స్టార్ హీరోయిన్స్ కంటే ఎక్కువగా అనసూయకి ఆహ్వానాలు అందుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా తిరుగులేని పాపులారిటీతో దూసుకుపోతూ ఉంది. ఇక ఇదే సమయంలో కొన్ని అనవసరమైన గొడవలకు వెళ్లి ట్రోలింగ్ కి కూడా గురవుతోంది.
Anasuya become enlightened these days
విజయ్ దేవరకొండ అభిమానులతో ఇంకా రకరకాల గొడవలలో అనసూయ చేసిన కామెంట్లు ఆమెకు రివర్స్ కౌంటర్లు ఇవ్వడం జరిగాయి. అయితే అవన్నీ జరుగుతూనే ఉన్నా వాటిని పట్టించుకోకుండా రీసెంట్ గా అనసూయ ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేయడం జరిగింది. ఈ వెకేషన్ లో కొడుకు పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకునే బాగా ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలో ఫుడ్డు మోతాదుకు మించి తీసుకోవటంతో దాన్ని కరిగించడానికి జిమ్ లో ఇప్పుడు అనసూయ తెగ కష్టపడి పోతూ ఉందట.
indigo airlines surprise gift to anchor anasuya
ఇదే విషయాన్ని తాజాగా అభిమానులతో ఓపెన్ గా చెప్పుకొచ్చింది. “ఫుడ్ చూసి ఫుల్ గా కుమ్మేసాను… ఇప్పుడు క్యాలరీస్ కలిగించటానికి… నానా తంటాలు పడుతున్నాను” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీంతో అనసూయ కి ఇన్నాళ్ళకి జ్ఞానోదయం అయ్యిందా… అంటూ కౌంటర్లు వేస్తున్నారు. మరోపక్క ఇదే సమయంలో గ్లామర్ ఫీల్డ్ లో ఉండి తిండిని కంట్రోల్ చేసుకోపోతే ఎలా అనసూయ అంటూ మరి కొంతమంది ఎటకారంగా.. సెటైర్లు వేస్తున్నారు.
