Anasuya Bharadwaj : అనసూయ నీకెందుకంత అసూయ.. నీ దాహం తీరితే చాలు అంతేగా..?
Anasuya Bharadwaj : యాంకర్ కమ్ యాక్టర్ అనసూయ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్న విషయం తెలిసిందే. కావాలని నెటిజన్లు ఆమెను ‘ఆంటీ’ అని ట్రోల్ చేస్తున్నారు. అయితే, ఆమె తొందరపాటులో చేసిన పొరపాటే ప్రస్తుతం ఈ పరిణామానికి దారితీసిందని కామెంట్లు కూడా వస్తున్నాయి.అనసూయ కావాలనే ఇలా విజయ్ దేవరకొండ లైగర్ మూవీ సినిమాపై పోస్టు కొట్టి అతని అభిమానుల కోపానికి బలి అయ్యిందని కొందరు అంటున్నారు.
Anasuya Bharadwaj : ఎందుకు నీకంత దాహం..
అనసూయ చేసిన పనికి నేటికి ఆమె ఇంకా ట్రోలింగ్‌కు గురవుతూనే ఉంది. ఇటీవల సైబర్ క్రైమ్‌ను ఆమె ఆశ్రయించిన ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు.తీరా అనసూయకు మద్దతుగా నిలిచిన వారిని కూడా ఫ్యాన్స్ ఓ ఆట ఆడుకుంటున్నారు. తాజాగా హీరోయిన్ శ్రద్ధా దాస్ అనసూయను సపోర్టు చేసి ఆమె కూడా ట్రోలింగ్‌కు గురైంది. ఇలా ఫ్యాన్స్ తమ ప్రతీకారం తీర్చుకుంటున్నారు. నిజానికి అనసూయకు ఇవన్నీ అవసరం లేదు. ఇండస్ట్రీలో ఎవరికీ లేని బాధ ఈవిడకు ఎందుకు? అని ప్రశ్నించేవారు లేకపోలేదు. అర్జున్ రెడ్డి టైంలో విజయ్ దేవరకొండ ఏదో అన్నాడని..
Anasuya Bharadwaj Dispute With Vijay Devarakonda Movie Liger
లైగర్ మూవీ ఫ్లాప్ అయ్యిందని ఈమె సెలబ్రెట్ చేసుకోవడం ఎంతవరకు కరెక్టు.. వారంతా సినిమా పోయిందన్న బాధలో ఉంటే నీ పైశాచిక ఆనందం ఎంటని కొందరు ఇండస్ట్రీ వాళ్లే సీరియస్ అవుతున్నారు. అమ్మను తిట్టాడని.. అమ్మాయిని కొట్టాడని అనసూయ బాగా ఫీలయ్యి రెచ్చిపోవడానికి ఈవిడ ఏమి స్త్రీ జనోద్ధరకురాలు కాదుకదా.. ఒక్కసారి కూడా మహిళల కోసం రోడ్డెక్కి పోరాడింది లేదు. మహిళలు, అమ్మాయిలపై అత్యాచారాలు జరిగినా స్పందించలేదు. మరి ఎందుకు ఈవిడ విజయ్ దేవరకొండ మూవీపై కామెంట్ చేయాలి.ఈమెకు కావాల్సిందిల్లా పబ్లిసిటీ.. ఆమె దాహం తీరాలి. రాత్రికి రాత్రి ఫుల్ క్రేజీ రావాలి. తన గురించి ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకోవాలి. అదే అనసూయకు కావాల్సింది అని నెటిజన్లు సీరియస్ అవుతున్నారు.
