Home » Entertainment » Anasuya Bharadwaj Gets Calls From Industry On Vijay Deavrakonda Fans Trolling
Entertainment

Anasuya : వెనక్కి తగ్గిన అనసూయ.. వాళ్లు ఫోన్ చేయడంతో సైలెంట్ అయిన యాంకర్

Authored By
aruna
The Telugu News | Published on: August 26, 2022, 6:20 pm
Advertisement

Anasuya : అనసూయ లేనిపోని వివాదాలను తన నెత్తిన పెట్టుకుంటుంది. గాలికి పోయే దాన్ని అక్కడెక్కడో తగిలించుకున్నట్టు చేస్తుంది. నిన్నటి నుంచి అనసూయ ట్రెండ్ అవుతూనే ఉంది. లైగర్ సినిమా పోవడంతో అనసూయ వేసిన పరోక్షమైన ట్వీట్ నానా కాంట్రవర్సీలకు దారి తీస్తోంది. సినిమా పోయిందని ఫ్యాన్స్ అంతా బాధపడుతుంటే.. అనసూయ మాటలు మరింతగా రెచ్చగొట్టేట్టు అనిపించినట్టున్నాయి. అర్జున్ రెడ్డి సమయంలో అనసూయ ఎంతగా ఎగిరిందో అందరికీ తెలిసిందే. విజయ్ మాట్లాడిన మాటలు, సినిమాలోని బూతుల మీద అనసూయ బాగానే ఫైట్ చేసింది.

Advertisement

అయితే ఆ సమయంలో అనసూయ మీద విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. ఐదేళ్ల క్రితం జరిగిన ఆ విషయాన్ని అందరూ మరిచిపోయారు. అనసూయ కూడా మరిచిపోయిందని అంతా అనుకున్నారు. ఎందుకంటే విజయ్ నిర్మించిన మీకు మాత్రమే చెప్తా సినిమాలో అనసూయ కూడా నటించింది. అయితే ఇప్పుడు లైగర్ సినిమా పోవడంతో మళ్లీ అనసూయ తన స్టైల్లో సెటైర్లు వేసింది. అమ్మని, ఆడవాళ్లని అంటే ఉసురు ఊరికే పోదు.. కర్మ అనేది మనల్ని కొడుతుంది అంటూ ఇండైరెక్ట్‌గా కౌంటర్లు వేసింది. దీంతో అనసూయను విజయ్ ఫ్యాన్స్ దారుణంగా తిట్టిపోశారు. ఆంటీ అంటూ ట్రోల్ చేశారు.

Anasuya Bharadwaj Gets Calls From Industry on vijay deavrakonda fans trolling

Advertisement

నన్ను ఆంటీ అంటారా? మీ అందరి స్క్రీన్ షాట్లు తీశాను.. ఇదే ఫైనల్ వార్నింగ్.. ఇంకోసారి ఇలాంటి పిచ్చి వాగుడు వాగితే అందరి మీదా కేసులు వేస్తాను అని బెదిరించింది. అయితే అనసూయ మీద ఇంకా ట్రోలింగ్ పెరిగింది. తాజాగా అనసూయ మరో ట్వీట్ వేసింది. టీవీల్లో, సినిమాల్లో చేసే దానికి బయట ఉండేదానికి తేడా ఉంటుందని తెలుసుకోలేని మూర్ఖులతో నీకేంటి.. అలాంటి వాళ్ల గురించి పట్టించుకోకు అని నాకు సినీ ఇండస్ట్రీలోని పెద్దలు ఫోన్‌లు చేస్తున్నారు.. వారికి గౌరవం ఇచ్చి కాస్త వెనక్కి తగ్గుతున్నాను.. అందుకే కాస్త గ్యాప్ ఇస్తున్నా.. కానీ మీ అందరినీ మాత్రం వదిలి పెట్టను అంటూ అనసూయ వార్నింగ్ ఇచ్చింది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి