Home » Entertainment » Anasuya Bharadwaj Post A Reel With The Warrior Movie Whistle Song In Instagram
Entertainment

Anasuya : విజిల్ వేసి కుర్రాళ్ల గుండెల్ని గ‌ల్లంతు చేసిన అన‌సూయ‌..!

Authored By
Sam C
The Telugu News | Published on: September 29, 2022, 5:30 pm
Advertisement

Anasuya : అందాల అన‌సూయ నిత్యం వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంద‌నే విష‌యం తెలిసిందే. ఈ అమ్మ‌డు త‌న అంద‌చందాల‌తో సందడి చేయ‌డ‌మే కాక ప‌లు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ హైలైట్ అవుతుంది. ఈ మధ్య అనసూయ పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ఆమె లైగర్ మూవీ పరాజయాన్ని ఎంజాయ్ చేస్తూ ట్వీట్ చేశారు. తల్లిని తిట్టిన పాపం వెంటాడి లైగర్ ప్లాప్ అయ్యిందంటూ పరోక్షంగా సోషల్ మీడియా కామెంట్ చేసింది. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమెను టార్గెట్ చేశారు. ఆంటీ అంటూ అనసూయపై ట్రోల్స్ కి తెగబడ్డారు. మరో వైపు అనసూయ కూడా తగ్గలేదు. సైబర్ క్రైమ్ లో తనను ఆంటీ అని వేధిస్తున్నారని కంప్లైంట్ ఇచ్చారు. వారిని వ‌దిలి పెట్టేది లేదంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది.

Advertisement

Anasuya : అన‌సూయ అద‌ర‌హో…

అన‌సూయ ఎప్పుడు గ్లామర్ ఫొటోలతో ఎంటర్ టైన్ చేస్తూ ఉంటుంది. కాని కొద్ది రోజులుగా డ్యాన్స్ వీడియోల‌తో దర్శనమిస్తూ ర‌చ్చ చేస్తుంది. మహేశ్ బాబు ఒక్కడు మూవీలోని నువ్ ఏ మాయ చేశావో గానీ అనే పాటకు స్టెప్పులేసింది. దానికి మంచి రెస్పాన్స్ రావ‌డంతో ఇప్పుడు విజిల్ విజిల్ అనే పాట‌కు చిందులేసింది. అనసూయ స్టెప్పులు చూసి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. ఈ అమ్మ‌డు గ‌తంలో జబర్దస్త్ స్టేజ్ పై డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకునేది అనసూయ. ఇటీవల ఆ షో నుంచి తప్పుకున్న అనసూయకు జబర్దస్త్ గుర్తొచ్చిందేమో అన్నట్లుగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Anasuya Bharadwaj Post A Reel with The Warrior Movie Whistle Song In Instagram

Advertisement

అన‌సూయ ఒకవైపు టీవీ షోలు, మరోవైపు సినిమాలు చేయడంతో పాటు అప్పుడప్పుడూ స్పెషల్ సాంగ్‌లు, వెబ్ సిరీస్‌లు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్నప్పటికీ.. సోషల్ మీడియాలోనూ అనసూయ యమ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. అన‌సూయ న‌టించిన ప‌లు సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమాలు హిట్ అయితే అన‌సూయ కెరీర్‌కి తిరుగు ఉండ‌దు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి