Anasuya : ప‌వ‌న్ కాలి గోటికి కూడా స‌రిపోవు.. అన‌సూయ‌పై అంత ఫైర్ కావ‌డానికి కారణం? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Anasuya : ప‌వ‌న్ కాలి గోటికి కూడా స‌రిపోవు.. అన‌సూయ‌పై అంత ఫైర్ కావ‌డానికి కారణం?

Anasuya : అందాల ముద్దుగుమ్మ అన‌సూయ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అనుసూయకు జబర్దస్త్ మంచి క్రేజ్‌ను సంపాదించి పెట్టింది. జబర్దస్త్ ద్వారా వచ్చిన ఫేంతో సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. క్షణం, రంగస్థలం,కథనం, విమానం , పుష్ప, కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. రంగస్థలం సినిమా తరువాత అనసూయ క్రేజ్ మ‌రింత పెరిగింది. ఈ సినిమా త‌ర్వాత ఆమె వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం […]

 Authored By ramu | The Telugu News | Updated on :9 July 2024,2:18 pm

ప్రధానాంశాలు:

  •  Anasuya : ప‌వ‌న్ కాలి గోటికి కూడా స‌రిపోవు.. అన‌సూయ‌పై అంత ఫైర్ కావ‌డానికి కారణం?

Anasuya : అందాల ముద్దుగుమ్మ అన‌సూయ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అనుసూయకు జబర్దస్త్ మంచి క్రేజ్‌ను సంపాదించి పెట్టింది. జబర్దస్త్ ద్వారా వచ్చిన ఫేంతో సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. క్షణం, రంగస్థలం,కథనం, విమానం , పుష్ప, కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. రంగస్థలం సినిమా తరువాత అనసూయ క్రేజ్ మ‌రింత పెరిగింది. ఈ సినిమా త‌ర్వాత ఆమె వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది..

Anasuya ఫ్యాన్స్ ఫైర్

హీరోయిన్లతో సమానంగా అనసూయ క్రేజ్ ఉందంటే.. ఆమె ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో చెక్కుచెదరని అభిమానగణం ఆమె సొంతం. అనసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఈ హ్యాట్ బ్యూటీ 38 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ స్టార్స్‌కు గట్టి పోటీ ఇస్తుంది. మ‌రోవైపు వివాదాల‌తో కూడా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంటుంది. అయితే అత్తారింటికి దారేది మూవీలోని స్పెషల్ సాంగ్ చేసేందుకు మొదట అనసూయనే దర్శకుడు త్రివిక్రమ్ సంప్రదించాడట. పవన్ కళ్యాణ్ మూవీ అంటే విపరీతమైన రీచ్ ఉంటుంది. చిన్న పాత్ర అయినా చేయడానికి నటులు ఆసక్తి చూపుతారు. అనసూయ మాత్రం ఆయనతో కలిసి డాన్స్ చేసే బంపర్ ఆఫర్ వదులుకుందట.

Anasuya ప‌వ‌న్ కాలి గోటికి కూడా స‌రిపోవు అన‌సూయ‌పై అంత ఫైర్ కావ‌డానికి కారణం

Anasuya : ప‌వ‌న్ కాలి గోటికి కూడా స‌రిపోవు.. అన‌సూయ‌పై అంత ఫైర్ కావ‌డానికి కారణం?

”ఇట్స్ టైం టు పార్టీ నౌ” సాంగ్ లో సమంత, ప్రణీత సుభాష్ తో పాటు అనసూయ డాన్స్ చేయాల్సి ఉంది. కేవలం నేను మాత్రమే సాంగ్ లో ఉండాలి. మరొక ఇద్దరు హీరోయిన్స్ తో కలిసి డాన్స్ చేయడానికి ఒప్పుకోను అన్నారట. దాంతో అనసూయకి బదులు ఖుషి ఫేమ్ ముంతాన్ ని తీసుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మూవీ ఆఫర్ రిజెక్ట్ చేయ‌డంతో అభిమానులు ఫైర్ అయ్యారు. అనసూయను ట్రోల్ చేశారు. నువ్వు పవన్ కళ్యాణ్ కాలి గోటికి కూడా సరిపోవు. ఆయనతో సినిమా చేయనంటావా? అని ఘాటైన కామెంట్స్ తో చుక్కలు చూపించారు. ఈ విష‌యాన్ని అనసూయ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతం ఆ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది