
Anasuya : పవన్ కాలి గోటికి కూడా సరిపోవు.. అనసూయపై అంత ఫైర్ కావడానికి కారణం?
Anasuya : అందాల ముద్దుగుమ్మ అనసూయ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అనుసూయకు జబర్దస్త్ మంచి క్రేజ్‌ను సంపాదించి పెట్టింది. జబర్దస్త్ ద్వారా వచ్చిన ఫేంతో సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. క్షణం, రంగస్థలం,కథనం, విమానం , పుష్ప, కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. రంగస్థలం సినిమా తరువాత అనసూయ క్రేజ్ మరింత పెరిగింది. ఈ సినిమా తర్వాత ఆమె వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది..
హీరోయిన్లతో సమానంగా అనసూయ క్రేజ్ ఉందంటే.. ఆమె ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో చెక్కుచెదరని అభిమానగణం ఆమె సొంతం. అనసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఈ హ్యాట్ బ్యూటీ 38 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ స్టార్స్‌కు గట్టి పోటీ ఇస్తుంది. మరోవైపు వివాదాలతో కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటుంది. అయితే అత్తారింటికి దారేది మూవీలోని స్పెషల్ సాంగ్ చేసేందుకు మొదట అనసూయనే దర్శకుడు త్రివిక్రమ్ సంప్రదించాడట. పవన్ కళ్యాణ్ మూవీ అంటే విపరీతమైన రీచ్ ఉంటుంది. చిన్న పాత్ర అయినా చేయడానికి నటులు ఆసక్తి చూపుతారు. అనసూయ మాత్రం ఆయనతో కలిసి డాన్స్ చేసే బంపర్ ఆఫర్ వదులుకుందట.
Anasuya : పవన్ కాలి గోటికి కూడా సరిపోవు.. అనసూయపై అంత ఫైర్ కావడానికి కారణం?
”ఇట్స్ టైం టు పార్టీ నౌ” సాంగ్ లో సమంత, ప్రణీత సుభాష్ తో పాటు అనసూయ డాన్స్ చేయాల్సి ఉంది. కేవలం నేను మాత్రమే సాంగ్ లో ఉండాలి. మరొక ఇద్దరు హీరోయిన్స్ తో కలిసి డాన్స్ చేయడానికి ఒప్పుకోను అన్నారట. దాంతో అనసూయకి బదులు ఖుషి ఫేమ్ ముంతాన్ ని తీసుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మూవీ ఆఫర్ రిజెక్ట్ చేయడంతో అభిమానులు ఫైర్ అయ్యారు. అనసూయను ట్రోల్ చేశారు. నువ్వు పవన్ కళ్యాణ్ కాలి గోటికి కూడా సరిపోవు. ఆయనతో సినిమా చేయనంటావా? అని ఘాటైన కామెంట్స్ తో చుక్కలు చూపించారు. ఈ విషయాన్ని అనసూయ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
This website uses cookies.