Anasuya Bharadwaj : వీకెండ్ పార్టీ.. పబ్‌లో చిందులు వేస్తోన్న అనసూయ
Anasuya Bharadwaj : సెలెబ్రిటీలు వీకెండ్ వస్తే చాలు ఫుల్ చిల్ అవుతుంటారు. అయితే కొంత మంది మాత్రం శని, ఆది వారాలు అని తేడా లేకుండా కష్టపడుతుంటారు. కానీ అనసూయ మాత్రం ఆ రెండు రోజుల్లో షూటింగ్లకు నో చెబుతుందట. ఆ రెండు రోజులు తన ఫ్యామిలీకే కేటాయిస్తుందట. ఎంతో అత్యవసరం అయితే తప్పా ఆ రెండు రోజులు పని చేయనని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో అనసూయ చెప్పుకొచ్చింది. అయితే తాజాగా అనసూయ వీకెండ్ పార్టీని గ్రాండ్‌గానే సెలెబ్రేట్ చేసుకున్నట్టుంది.
యూట్యూబర్ నిఖిల్ బర్త్ డే సందర్భంగా అనసూయ పబ్‌కు వెళ్లినట్టుంది. ఇక అక్కడ ఈ ఇద్దరూ కూడా ఫుల్లుగా డ్యాన్సులు వేశారు. యూట్యూబర్ నిఖిల్ సెలెబ్రిటీల ఇంటర్వ్యూలతో ఫేమస్ అయ్యాడు. అంతే కాకుండా చాలా మంది బుల్లితెర తారలతో నిఖిల్‌కు పరిచయాలున్నాయి. బిగ్ బాస్ ఐదో సీజన్‌లో నిఖిల్ పాల్గొనబోతోన్నాడంటూ రూమర్లు కూడా వచ్చాయి. కానీ నిఖిల్‌కు మాత్రం ఆ అవకాశం రాకుండానే చేజారిపోయింది.
Anasuya Bharadwaj : అనసూయ డ్యాన్సులు..
నిఖిల్ బర్త్ డే సందర్భంగా అనసూయ డ్యాన్స్ వేసింది. పబ్‌లో వెనకాల పాటలు ప్లే చేస్తుంటే.. దానికి తగ్గట్టుగా నిఖిల్, అనసూయ స్టెప్పులు వేశారు. ఆ వీడియోను అనసూయ తన ఫేస్ బుక్ స్టోరీలో పోస్ట్ చేసింది. ఈ వింత మనిషి నిఖిల్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అని అనసూయ పోస్ట్ చేసింది. మొత్తానికి ఈసారి కూడా అనసూయ సైమా ఈవెంట్‌కు దూరంగా ఉన్నట్టు కనిపిస్తోంది. గతంలో సైమా తనను తక్కువ చేసి చూసిందని అప్పటి నుంచి ఈ వేడుకలకు అనసూయ దూరంగా ఉంటోంది.