Brahmamudi February 14th Episode: బ్రహ్మముడి ఫిబ్రవరి 14 ఎపిసోడ్: ఇల్లు వదిలి వెళ్లిపోయిన రాజ్, కావ్య.. రుద్రాణి ప్లాన్‌తో ధాన్యలక్ష్మి ఉగ్రరూపం..!

Authored By Jagadesh Gatla | The Telugu News | Published on: February 14, 2026, 9:00 am

Brahmamudi February 14th Episode: స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతున్న పాపులర్ సీరియల్ ‘బ్రహ్మముడి’ రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠభరితంగా సాగుతోంది. నేటి ఫిబ్రవరి 14 ఎపిసోడ్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆస్తి గొడవలు, కిడ్నాప్ డ్రామాలు, చివరకు రాజ్, కావ్య ఇల్లు వదిలి వెళ్లిపోయేంత వరకు పరిస్థితి వెళ్లింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Brahmamudi February 14th Episode: బ్రహ్మముడి ఫిబ్రవరి 14 ఎపిసోడ్: ఇల్లు వదిలి వెళ్లిపోయిన రాజ్, కావ్య.. రుద్రాణి ప్లాన్‌తో ధాన్యలక్ష్మి ఉగ్రరూపం..!

Brahmamudi February 14th Episode: బ్రహ్మముడి ఫిబ్రవరి 14 ఎపిసోడ్: ఇల్లు వదిలి వెళ్లిపోయిన రాజ్, కావ్య.. రుద్రాణి ప్లాన్‌తో ధాన్యలక్ష్మి ఉగ్రరూపం..!

Brahmamudi February 14th Episode : రుద్రాణి క్రూరమైన ప్లాన్

ఎపిసోడ్ ప్రారంభంలో రాహుల్, రేఖలు రుద్రాణిని నిందిస్తారు. నీ ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అవుతున్నాయని ఎత్తిపొడుస్తారు. దీంతో రుద్రాణి మరో కొత్త ప్లాన్ వేస్తుంది. అప్పు, కళ్యాణ్‌లపై దాడి చేయించి, ఆ నిందను రాజ్, కావ్యలపైకి నెట్టాలని నిర్ణయించుకుంటుంది. అలా చేస్తే ధాన్యలక్ష్మి గొడవ చేసి ట్రస్ట్ పనులను అడ్డుకుంటుందని రుద్రాణి ఆలోచన.

Brahmamudi February 14th Episode : పోలీసుల నుంచి అప్పుకు కాల్

మరోవైపు అప్పుకు పోలీసుల నుంచి ఫోన్ వస్తుంది. హాస్పిటల్ లో పాపపై దాడి చేసిన వాళ్లు దొరికారని, వాళ్లు ఒక మినిస్టర్ పేరు చెబుతున్నారని పోలీసులు సమాచారం ఇస్తారు. నిజం తెలుసుకోవడానికి అప్పు, కళ్యాణ్ బయలుదేరుతారు. సరిగ్గా ఇదే అదనుగా భావించిన రుద్రాణి, తన రౌడీలకు సమాచారం అందిస్తుంది.

కళ్యాణ్, అప్పు కిడ్నాప్

నిజం తెలుసుకోవడానికి వెళ్తున్న కళ్యాణ్, అప్పులను దారిలో రౌడీలు అడ్డగిస్తారు. కళ్యాణ్ పై దాడి చేసి ఇద్దరినీ కిడ్నాప్ చేస్తారు. రుద్రాణి ఆదేశాల మేరకు, ఈ కిడ్నాప్ రాజ్ చేయించినట్లుగా క్రియేట్ చేసి, ఆ వీడియోను ధాన్యలక్ష్మికి పంపిస్తారు.

ఆస్తి పంపకాలు.. ధాన్యలక్ష్మి రచ్చ

ఇంట్లో రాజ్ కీలక నిర్ణయం తీసుకుంటాడు. పిన్ని (ధాన్యలక్ష్మి) ఆస్తి కోసం గొడవ పడుతుండటంతో, సగం ఆస్తిని ట్రస్ట్ కు, మిగిలిన సగం ఆస్తిని కళ్యాణ్ పేరు మీద రాస్తున్నట్లు ప్రకటిస్తాడు. ఇది విన్న కావ్య సంతోషించినా, ధాన్యలక్ష్మి మాత్రం ఊగిపోతుంది. “నా కొడుకుకు భిక్షం వేస్తున్నారా? ఇన్నాళ్లు కావ్య పేరు మీద ఆస్తి ఉంటే ఎవరూ మాట్లాడలేదు” అంటూ గొడవకు దిగుతుంది.

ఇల్లు వదిలి వెళ్లిన రాజ్, కావ్య

సరిగ్గా అప్పుడే ధాన్యలక్ష్మి ఫోన్ కు కిడ్నాప్ వీడియో వస్తుంది. అది చూసి షాక్ అయిన ధాన్యలక్ష్మి.. “ఆస్తి కోసం నా కొడుకును కిడ్నాప్ చేయిస్తావా రాజ్?” అంటూ నిందిస్తుంది. ఆ మాటలకు రాజ్ కుప్పకూలిపోతాడు. తన పిన్ని తనను అంతలా అసహ్యించుకుంటుందని ఊహించలేకపోతాడు. దీంతో ఆవేశంగా, “అప్పు, కళ్యాణ్ లను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చాకే మేము ఈ ఇంట్లో అడుగుపెడతాం” అని శపథం చేసి, కావ్యను తీసుకుని ఇల్లు వదిలి వెళ్లిపోతాడు.

మొత్తానికి రుద్రాణి ప్లాన్ సక్సెస్ అయ్యింది. రాజ్, కావ్యలు అప్పు, కళ్యాణ్ లను ఎలా కాపాడతారు? అసలు నిజం ఎలా బయటపడుతుంది? అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp