anasuya crazy role in acharya
Anasuya: బుల్లితెరతో పాటు వెండితెరపై దుమ్ము రేపుతున్న అందాల ముద్దుగుమ్మ అనసూయ. ఎప్పటికప్పుడు సరికొత్త లుక్స్‌తో జబర్దస్త్ వేదికపై హంగామా చేసే ఈ బ్యూటీ.. ఈ మధ్యకాలంలో సినిమాతో కూడా బిజీ అయింది. ఓ వైపు బుల్లితెర ప్రోగ్రామ్స్ హాండిల్ చేస్తూనే వెండితెరపై తన మార్క్ చూపెడుతోంది. రంగస్థలంలో రంగమ్మత్తగా తనలోని నటనా ప్రతిభను కెమెరా ముందు పెట్టిన అనసూయ.. రీసెంట్‌గా ‘పుష్ప’ సినిమాలో దాక్షాయణిగా ఆకట్టుకుంది. ఖిలాడి చిత్రంతో కూడా పలకరించింది. ఇక రీసెంట్‌గా చిరంజీవితో యాడ్‌లో కనిపించి కూడా సందడి చేసింది. ఇక చిరంజీవి ‘ఆచార్య’ సినిమాతో మరోసారి మెస్మరైజ్ చేసేందుకు సిద్ధమైంది.
ఈ సినిమాలో అనసూయ రోల్‌కి సంబంధించి ఓ కీలక విషయం బయటకొచ్చింది.మెగాస్టార్ చిరంజీవి , సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న ‘ఆచార్య’ సినిమాలో అనసూయ కీలక పాత్రలో నటించిందట. కథను మలుపుతిప్పే క్యారెక్టర్‌లో అనసూయ కనిపించబోతుందట. ఆమె పాత్రకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఈ సినిమా కోసం ఆమె రూ.25 లక్షల వరకు పారితోషకం తీసుకుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి అనసూయ పాత్రపై పూర్తి క్లారిటీ రావాలంటే ఏప్రిల్ 29 వరకు ఆగాల్సిందే. ఇక గోపిచంద్, రాశిఖన్నా జంటగా నటిస్తోన్న పక్కా కమర్షియల్ సినిమాలోనూ అనసూయ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇది జులై 1న థియేటర్లలో విడుదల కానుంది. ఇక తాజాగా విడుదలైన దర్జా టీజర్‌లోనూ చీరకట్టిన శివంగిగా విశ్వరూపం చూపించింది. దీనిని చూస్తుంటే ఫుల్ లెన్త్ నెగెటివ్ రోల్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
anasuya crazy role in acharya
ఇక ఆచార్య సినిమాలో కాజల్ అగర్వాల్ మరియు పూజా హెగ్డే లు హీరోయిన్లు గా నటించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాకి సంగీత బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. అలాగే మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో సినిమాని తెరకెక్కించారు. ఏది ఏమైనా ప్రస్తుతం అనసూయ సినీ కెరీర్ పుల్ స్వింగ్‌లో ఉంది. అటు స్మాల్ స్క్రీన్ పై యాంకరింగ్ తో ఫుల్ బిజీగా ఉంటూనే.. ఇటు సిల్వర్ స్క్రీన్ పై తనదైన శైలిలో డిఫరెంట్ పాత్రలు చేస్తూ సత్తా చాటుతోంది. కొణిదెల ప్రొడెక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ఆచార్య’ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య పాత్ర పోషించారు. చెర్రీ సరసన పూజా హెగ్డే ఆడిపాడింది. దేవాదాయ శాఖలో జరుగుతున్న మోసాలను చూపిస్తూ సరికొత్తగా సినిమా రూపొందించారట డైరెక్టర్ కొరటాల శివ.
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
Insta Reel : వరంగల్లోని కొత్తవాడలో ఇన్స్టాగ్రామ్లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
Samantha : టాలీవుడ్లో మరో క్రేజీ కాంబినేషన్ ఫైనలైజ్ అయ్యే దిశగా సాగుతోంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన…
Jr Ntr : స్టార్ హీరోలు రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికి టాలీవుడ్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ…
Girl : ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొందరు మాట్లాడే మాటలు అందరిని ఆశ్చర్యపరుస్తుంటాయి.…
Sreeleela : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల. పుష్ప 2 సినిమాలో…
This website uses cookies.