Anasuya : రంగ‌మ్మత్త డ్యాన్స్ చూస్తే త‌ట్టుకోలేరు.. అన‌సూయ డ్యాన్స్ వీడియో వైర‌ల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anasuya : రంగ‌మ్మత్త డ్యాన్స్ చూస్తే త‌ట్టుకోలేరు.. అన‌సూయ డ్యాన్స్ వీడియో వైర‌ల్

 Authored By mallesh | The Telugu News | Updated on :21 April 2022,7:30 pm

Anasuya : యాంక‌ర్, న‌టి అన‌సూయ‌.. బుల్లితెరపై త‌న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓవైపు బుల్లితెరపై అలరిస్తూనే.. మరోవైపు వెండితెరపై కూడా సత్తా చాటుతోంది. సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ అక్టీవ్ గా ఉండే అన‌సూయ న‌ల్గొండ పోచంప‌ల్లికి చెందిన ప‌క్కా తెలంగాణ అమ్మాయి. బుల్లితెరపై త‌న‌దైన శైలిలో ఆక‌ట్టుకుంటుంది. కాలేజ్ డేస్ లో ఎన్ సీసీ లో పరిచయం అయిన సుషాంక్ భరద్వాజ్‌తో ప్రేమలో పడిన అనసూయ అతడినే పెళ్లి చేసుకుంది.ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకున్న

ఈ యాంకర్ భామకు శౌర్య, అయాన్ అనే ఇద్దరు పిల్లలున్నారు. అయినా కూడా త‌న అందం అభిన‌యంతో ఎంతో మంది ఫ్యాన్స్ ని సొంతం చేసుకుంది.జబర్దస్త్ తో ఆమె తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. యాంక‌రింగ్ చేస్తూ మంచి పేరు సంపాదించుకుంది. త‌న స్టైల్ లో యాంక‌రింగ్ చేస్తూ న‌వ్వులు పూయిస్తుంది. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవితో ఓ యాడ్ లో అల‌రించింది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఇటీవల అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో దాక్షాయణి పాత్రలో సునిల్ ప‌క్క‌న నటించి మెప్పించింది.

Anasuya dance video viral

Anasuya dance video viral

అంతకు ముందు క్షణం సినిమాలో కూడా అనసూయ నటనకు మంచి మార్కులే పడ్డాయి. సోగ్గాడే చిన్నినాయనా, గాయత్రి, కథనం’ థ్యాంక్యూ సిస్ట‌ర్ వంటి సినిమాలతో టాలీవుడ్ లోనూ తనదైన ముద్ర వేసింది. ప్ర‌స్తుతం మ‌రిన్ని తెలుగు చిత్రాల్లో న‌టిస్తోంది.అయితే రంగ‌మ్మ‌త్త డ్యాన్స్ చేసినా ఓ వీడియో ప్ర‌స్తుతం తెగ వైర‌ల్ అవుతోంది. ఓ స్టేజిపై ప‌వ‌న్ క‌ల్యాణ్ ఖుషి మూవీలోని చెలియా.. చెలియా.. సాంగ్ లో డ్యాన్స్ చేస్తూ త‌న అంద‌చందాల‌తో కుర్రాళ్ల‌ను పిచ్చెక్కిస్తోంది. ఇన్ స్టాలో ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్ అవుతోంది. లేటెందుకు మీరు కూడా ఓ లుక్కేయండి…

 

View this post on Instagram

 

A post shared by Anasuya princess (@anasuya__princess)

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది