Home » Entertainment » Anasuya Experienced This For The First Time With Nagarjuna
Entertainment

Anasuya: అనసూయకి ఆ అనుభవం మొదటిసారి నాగార్జునతోనే అని ఇన్నాళ్ళకి ఓపెన్‌గా చెప్పేసింది

Authored By
vamana sai
The Telugu News | Updated on: August 30, 2021, 9:11 am
Advertisement

Anasuya: బుల్లితెర మీద సందడి చేస్తూ విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచేసుకుంది. ఆ ఫాలోయింగ్ ఏకంగా తనకి బిగ్ స్క్రీన్ మీద అవకాశాలు వచ్చేలా చేసింది. ఇప్పుడు అనసూయకి అటు సోషల్ మీడియాలో ఇటు ఇండస్ట్రీ వర్గాలలో ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ఆమె చేస్తున్న షోలు సినిమాల లిస్ట్ చూస్తే అర్థమవుతుంది. బుల్లితెర మీద షోస్ కి ఏమాత్రం డిస్టబెన్స్ లేకుండా సినిమాలలో క్యారెక్టర్స్, స్పెషల్ నంబర్స్‌ను ఎంచుకుంటోంది. ఇక గత కొంత కాలంగా అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న గ్లామర్ పిక్స్‌కి పాజిటివ్, నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.

Advertisement

anasuya-experienced this for the first time with nagarjuna

అందులో మంచి మాత్రమే తీసుకుంటున్న అనసూయ కొన్ని మరీ మితి మీరిన కామెంట్స్‌కి అంతే ఘాటుగా రిప్లై ఇస్తూ వస్తోంది. ప్రస్తుతం అనసూయ పాన్ ఇండియన్ సినిమాలలో మంచి క్యారెక్టర్స్ చేస్తోంది. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియన్ సినిమా పుష్ప, మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న ఖిలాడి, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న రంగ మార్తాండ సినిమాలలో అనసూయ నటిస్తోంది. ఈ క్యారెక్టర్స్ అన్నీ తనకి మరొప రేంజ్‌లో క్రేజ్ తీసుకు వస్తాయని చాలా నమ్మకంగా ఉంది.

Advertisement

Anasuya: అనసూయ ఈ స్థాయిలో క్రేజ్ సంపాదించుకోవడానికి కారణం రాము బావ.

Anasuya-Bharadwaj

అయితే అనసూయ సినిమాల పరంగా ఈ స్థాయిలో క్రేజ్ సంపాదించుకోవడానికి కారణం రాము బావ. ఆయనెవరో అనుకుంటున్నారా..ఆయనే సొగ్గాడే చిన్ని నాయాన..టాలీవుడ్ మన్మధుడు..కింగ్ నాగార్జున. ఆయన డ్యూయల్ రోల్‌లో నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో నాగార్జున మరదలిగా అనసూయ మొదటిసారి బిగ్ స్క్రీన్ మీద కనిపించింది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో అనసూయ పాత్రకి చాలా మంచి పేరొచ్చింది. అయితే తాజాగా నాగార్జున బర్త్ డే సందర్భంగా తన మొదటి సిల్వర్ స్కీర్ అనుభవం మొదటిసారి నీతోనే రాము బావా..అంటూ సినిమాలో తను పోషించిన క్యారెక్టర్‌ను గుర్తు చేసుకుంటూ కొత్తగా నాగార్జునకి అనసూయ బర్త్ డే విషెస్ చెప్పింది.

Advertisement

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి