Home » Entertainment » Anasuya Fire For Not Giving Her Value
Entertainment

Anasuya : మరొక అతి పెద్ద వివాదంలో యాంకర్ అనసూయ – బిగ్ బ్రేకింగ్ ఇది..!

Authored By
Breaking News 2
The Telugu News | Published on: February 26, 2023, 9:00 am
Advertisement

Anasuya : యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది ఏం ఉండదు. ఆమె లైఫ్ తెరిచిన పుస్తకం అనే చెప్పుకోవాలి. జబర్దస్త్ కు రాకముందు తను ఎవరో కూడా చాలామందికి తెలియదు. జబర్దస్త్ కంటే ముందు పలు సినిమాల్లో నటించినా తనకు అంతగా గుర్తింపు రాలేదు కానీ.. ఎప్పుడైతే తను జబర్దస్త్ లో అడుగు పెట్టిందో అప్పటి నుంచి తన లైఫ్ స్టయిలే మారిపోయింది. తను ఇండస్ట్రీలో క్వీన్ అయింది. స్టార్ హీరోయిన్ కు ఏమాత్రం తీసిపోకుండా తనకు పాపులారిటీ వచ్చేసింది. సోషల్ మీడియాలో కూడా అనసూయ చాలా పాపులర్.

Advertisement

Anasuya Fire for not giving her value

తన లేటెస్ట్ ఫోటోషూట్స్ తో అనసూయ అందాలను ఆరబోస్తుంది. బుల్లితెరపై స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. కొన్నేళ్ల పాటు టాప్ పొజిషన్ ను ఎంజాయ్ చేసింది. సోషల్ మీడియాలో కూడా తనకు తిరుగులేదని నిరూపించుకుంది. ఇప్పుడు సినిమాల్లోనూ నటిస్తూ తనేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్న అనసూయ ఈ మధ్య యాంకరింగ్ చేయడం లేదు. తనకు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన జబర్దస్త్ ను కూడా అనసూయ వదిలేసింది. కాకపోతే ఇప్పుడు సినిమాల్లో బిజీ అయింది అను. ఇటీవల పుష్ప సినిమాలో నటించి దేశ వ్యాప్త గుర్తింపును తెచ్చుకుంది అనసూయ.

Advertisement

Anasuya Fire for not giving her value

Anasuya : పుష్ప సినిమాతో తనకు దేశ వ్యాప్త గుర్తింపు

అయితే.. సోషల్ మీడియాలో తనపై ఎవరైనా నెగెటివ్ కామెంట్స్ చేస్తే, ట్రోల్ చేస్తే మాత్రం అస్సలు ఊరుకోదు అనసూయ. ఇటీవల తన ఫాలోవర్స్ తో మాట్లాడిన అనసూయ.. ఆ తర్వాత చివర్లో అందరికీ థాంక్స్ చెబుతూ ఓ వీడియోను పంచుకుంది. జబర్దస్త్ లో లేనందుకు అందరూ ఫీల్ అవుతున్నారని చెప్పిన అనసూయ.. ఉన్నప్పుడు మాత్రం ఎవ్వరూ విలువ ఇవ్వలేదు. లేనప్పుడు మాత్రం తెగ ఫీల్ అవుతున్నారంటూ ఒక్కసారిగా సీరియస్ అయింది. అయితే.. తిరిగి బుల్లితెర మీద అడుగు పెట్టే అవకాశాలు మాత్రం ఇక లేనట్టే అన్నట్టుగా అనసూయ మాట్లాడిన మాటలు ఉన్నాయి. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి