Home » Entertainment » Anasuya Gets Emotional And Cried On Stage
Entertainment

Anasuya : మీడియా ప్రతినిధులు ముందు బోరున ఏడ్చేసిన అనసూయ… వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: March 21, 2023, 9:00 pm
Advertisement

Anasuya : డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన “రంగమార్తాండ” ఉగాది పండుగ సందర్భంగా ఈనెల 22న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ మరియు రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో ఈ సినిమాలో కనిపిస్తున్నారు. చాలాకాలం తర్వాత కృష్ణవంశీ సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో అనసూయ కీలకమైన పాత్ర పోషించడం జరిగింది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా అనసూయ మీడియా ప్రతినిధులు అందరూ ఉండగానే బోరున ఏడ్చింది. తనకి ఫస్ట్ నుండి కృష్ణవంశీ గారి సినిమాలంటే ఇష్టమని అప్పట్లో మురారి చాలా సార్లు చూసినట్లు చెప్పుకొచ్చింది.

Advertisement

Anasuya Gets Emotional And Cried On Stage

దీంతో కృష్ణవంశీ గారి దర్శకత్వంలో సినిమా చేయడమే అదృష్టం. ఆయన తన సినిమాల్లో లేడీస్ పాత్రలను చాలా అందంగా మరియు స్ట్రాంగ్ గా చూపిస్తారు. ఈ సినిమాలో కూడా నా పాత్ర దాదాపు ఆ రకంగానే ఉంటుంది. ప్రకాష్ రాజ్ గారి కోడలు పాత్రలో గీతా రంగారావుగా నేను కనిపిస్తాను అని తెలిపింది. వాస్తవానికి తన స్వభావానికి విరుద్ధమైన పాత్రలో ఈ సినిమాలో నటించిన అట్లు చెప్పుకొచ్చింది. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు నన్ను తిట్టుకుంటారేమోనని.. డైరెక్టర్ కృష్ణవంశీతో డిస్కషన్ పెట్టినట్లు చెప్పుకొచ్చింది. అయితే ఆ పాత్ర వరకు

Advertisement

anasuya participates in kite festival with family

అలా నటించడం కరెక్టేనని ఆయన సమర్థించారు. ఈ ఒక్క సినిమాతో మాత్రమే కాదు మళ్ళీ మళ్ళీ కృష్ణవంశీ గారితో సినిమాలు చేయాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో నటించడం తన అదృష్టం అని మీడియా ప్రతినిధులు ముందు అనసూయ కన్నీరు పెట్టుకోంది. ఎన్నో జన్మల్లో చేసుకున్న అదృష్టమో ఏమో తెలియదు కానీ ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని ఇదే విషయం డైరెక్టర్ కృష్ణ వంశీ గారితో చెప్పినట్లు అనసూయ చాలా ఎమోషనల్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి